Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

తిరుపతి మొదటి ఘాట్ రోడ్డు.. సీనియర్ జర్నలిస్ట్ మృతి

Advertiesment
road accident
, శుక్రవారం, 30 సెప్టెంబరు 2022 (09:09 IST)
తిరుపతిలోని మొదటి ఘాట్ రోడ్డులో చోటుచేసుకున్న ప్రమాదంలో సీనియర్ జర్నలిస్ట్ గోపాల్ రెడ్డి (75) మృతి చెందారు. వేగంగా దూసుకువచ్చిన ఓ గుర్తు తెలియని వాహనం గోపాల్ రెడ్డి ద్విచక్ర వాహనాన్ని ఢీకొనడంతో ఈ ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ఆయన అక్కడకక్కిడే ప్రాణాలు కోల్పోయాడు. 
 
కొద్దిసేపటి క్రితమే ఆయన బ్రహ్మోత్సవ కవరేజ్‌లో పాల్గొన్నారు. అది ముగించుకొని తిరిగి వస్తుండగా.. ఈ సంఘటన జరిగింది. గోపాల్ రెడ్డి మృతితో జర్నలిస్టులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. ఆయన మృతి పట్ల సంతాపం ప్రకటిస్తున్నారు. 
 
ఈ సందర్భంగా మంత్రి పెద్దిరెడ్డి మాట్లాడుతూ.. గోపాల్ రెడ్డి నాలుగు దశాబ్దాలకు పైగా జర్నలిజంలో తనదైన ముద్ర వేశారని, ఎందరో యువ జర్నలిస్టులకు ఆదర్శంగా నిలిచారన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఏపీలో నేడు టెట్ పరీక్షా ఫలితాలు రిలీజ్