Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఇక ప్రసవానికి రూ.3 వేలు... ఎక్కడ?

Advertiesment
childbirth
ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. వైఎస్సార్‌ ఆరోగ్య ఆసరా కింద ప్రోత్సాహకం పెంచుతున్నట్లు ప్రకటించారు.

సాధారణ ప్రసవానికి ప్రస్తుతం ఇస్తున్న రూ.3వేలు ప్రోత్సాహకాన్ని రూ.5 వేలకు, సిజేరిన్ ప్రసవానికి సంబంధించి ప్రోత్సాహకాన్ని 1000 నుంచి 3 వేల రూపాయలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. ఆస్పత్రి సేవలు అధ్వాన్నంగా ఉన్న జిల్లాలపై దృష్టి పెట్టాలని, రెండు వారాల్లో పరిస్థితి మెరుగు పడాలని అధికారులను ఆదేశించారు.

ఆరోగ్యశ్రీ నెట్ వర్క్ ఆస్పత్రుల్లో అన్ని నిబంధనలు పాటించాలని, 6 నెలల తర్వాత పరిస్థితులు మెరుగుపడకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు. జిల్లాల్లో ఆరోగ్యశ్రీ కో ఆర్డినేషన్ బాధ్యతలు ఇక నుంచి జేసీలకి అప్పజెప్పాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అందుకే వృద్ధులు బస్సు ప్రయాణాలు చేయొద్దని సూచిస్తున్నాం: రహదారులు, భవనాల శాఖ