నగరిలో సినీనటి రోజా గెలుపు.. 2681 ఓట్ల మెజారిటీతో..?

గురువారం, 23 మే 2019 (16:40 IST)
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ న‌గ‌రి అభ్య‌ర్థి రోజా మ‌రోసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. త‌న స‌మీప ప్రత్య‌ర్థి గాలి భాను ప్ర‌కాష్ (టీడీపీ)పై రోజా 2681 ఓట్ల మెజారిటీతో విజ‌యం సాధించారు. గతంలో 2014 ఎన్నిక‌ల్లో రోజా టీడీపీ అభ్య‌ర్థి గాలి ముద్దుకృష్ణ‌మ‌నాయుడుపై 858 ఓట్ల తేడాతో గెలిచారు. 
 
కాగా గాలి ముద్దు కృష్ణ‌మ నాయుడు అనారోగ్యంతో క‌న్ను మూయ‌గా, ఆయ‌న కుమారుడు గాలి భాను ప్ర‌కాష్ టీడీపీ త‌ర‌పున న‌గ‌రి బ‌రిలో నిలిచారు. అయితే తాను గెలిస్తే పార్టీ అధికారంలోకి రాదనే సెంటిమెంట్‌ను పటాపంచెలు చేస్తూ ఆమె గెలిచి చూపించారు. అదే విధంగా తాను గెలవడమే కాకుండా పార్టీ కూడా అధికారంలోకి రావడం పట్ల ఆమె హర్షాన్ని వ్యక్తం చేశారు.

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం AP Assembly 2019 Live results - YSRCP -107 / TDP-23, వైసీపీ 40 విజయం