వైకాపా నేత, మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ప్రత్యక్ష సాక్షుల్లో ఒకరైన వాచ్‌మెన్ రంగన్న అనుమానాస్పదంగా మృతి చెందిన విషయం తెల్సిందే. ఆయన మృతదేహానికి పోలీసులు శనివారం రీపోస్టుమార్టం చేశారు. పులివెందుల భాకరాపురం శ్మశానవాటికలో ఈ రీపోస్టుమార్టం ప్రక్రియను పూర్తి చేశారు. తన భర్త మృతిపై అనుమానాలు ఉన్నాయని రంగయ్య భార్య ఆరోపణలు చేసిన విషయం తెల్సిందే. పైగా, ఆమె పోలీసులకు ఫిర్యాదు కూడా ఇచ్చారు. ఈ నేపథ్యంలో సందేహాల నివృత్తి కోసం మరోమారు పోస్టుమార్టం నిర్వహించారు. మృతదేహంపై గాయాలు ఉన్నాయా? లేవా? అనే అంశాన్ని పోలీసులు పరిశీలించారు.
ఇదిలావుంటే, వైఎస్ వివేకా హత్య కేసులో సాక్షుల వరుస మరణాలు చర్చనీయాంశంగా మారింది. దీనిపై ఏపీ హోం మంత్రి అనిత స్పందించారు. సాక్షుల మరణాలపై కేబినెట్ మీటింగ్‌లో చర్చించామన్నారు. సమగ్ర దర్యాప్తునకు ఆదేశించామని చెప్పారు. వివేకా హత్య కేసులో ఎవరి మరణాలు అయినా మిస్టరీగా మాత్రం మిగిలిపోవన్నారు. తలకిందులుగా తపస్సు చేసినా, తపప్ు చేసిన వారికి శిక్ష తప్పదని ఆమె హెచ్చరించారు. రంగన్న పోస్ట్ మార్టం రత్వాత అన్ని విషయాలు వెలుగులోకి వస్తాయని పేర్కొన్నారు.