Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Monday, 28 April 2025
webdunia

అది యేడాది క్రితం పోస్టు.. ఈ కేసులో అంత తొందరెందుకో : ఆర్జీవీ ప్రశ్న

Advertiesment
ramgopalvarma

ఠాగూర్

, బుధవారం, 27 నవంబరు 2024 (10:45 IST)
తాను పరారీలో ఉన్నట్టు సాగుతున్న ప్రచారంలో ఏమాత్రం నిజం లేదంటూ వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ ఓ వీడియోను రిలీజ్ చేశారు. వర్మపై ఏపీలో పలు ప్రాంతాల్లో కేసులు నమోదైవున్నాయి. ఈ కేసుల్లో విచారించేందుకు ఆయనకు పోలీసులు నోటీసులు జారీ చేయగా, ఆయన షూటింగుల పేరుతో డుమ్మా కొడుతున్నారు. దీంతో పోలీసులు ఆయన కోసం గాలిస్తున్నారు. మరోవైపు, వర్మ పారిపోయారంటూ సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం సాగుతుంది. ఈ నేపథ్యంలో వర్మ ఓ వీడియోను రిలీజ్ చేశారు. 
 
తాను పారిపోయినట్టు సాగుతున్న ప్రచారంలో రవ్వంత కూడా నిజం లేదన్నారు. పెట్టిన కేసులపై అనుమానాలు ఉన్నాయనీ, సెక్షన్స్ ఎలా వర్తిస్తాయో అర్థం కావట్లేదంటూ వీడియోలో పేర్కొన్నారు. ఏపీ పోలీసుల నోటీసులకు తాను వణికిపోవడం, మంచం కింద కూర్చొని ఏడవటం లేదన్నారు. తాను సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులు వల్ల ఎవరి మనోభావాలో దెబ్బతిన్నాయ్ అంటూ ప్రశ్నించారు. 
 
ఒక యేడాది క్రితం పెట్టిన పోస్టుపై నలుగురు డిఫరెంట్ వ్యక్తులకు నాలుగు జ్యూరిస్డిక్షన్‌లో మూడు నాలుగు వ్యవధిలోనే మనోభావాలు దెబ్బతిన్నాయ్.. ఆవిధంగా వారు కేసులు పెట్టడం జరిగింది‌‌‌‌, తాను పోస్టు ఎవరి ఉద్దేశించి పెట్టానో.. వారికి కాకుండా ఇంకెవరో సంబంధం లేని థర్డ్ పార్టీ వారి  మనోభావాలు దెబ్బతింటే ఈ కేసులు, సెక్షన్లు ఎలా వర్తిస్తాయనేది తనకు అర్థం కావట్లేదన్నారు. 
 
తన మనుషులకు ఉన్న అనుమానం ఎంటంటే.. పీడించటానికే ఓ పద్ధతి ప్రకారం అందుబాటులో ఉన్న చట్టాలను వాడుతున్నారా.. ప్రస్తుతం రాజకీయ నాయకులు పోలీసులను ఆయుధంగా చేసుకొని పాలన చేస్తున్నారా అనే అనుమానం కలుగుతోంది. అది అమెరికా యూరప్‌లతో పాటు ఇక్కడా జరుగుతోందని, దీనిపై తాను ఏ ఒక్క పొలిటీషియన్‌న, పొలీస్ ఆఫీసర్‌ను బ్లేమ్ చేయటం లేదన్నారు. కానీ ఈవేలో ఖచ్చితంగా చెయ్యెచ్చు.. చెయ్యాలనే టెంప్టింగ్ ఉండొచ్చు... కానీ చట్టం అనేది ఒకటి ఉంటుందన్నారు. 
 
పౌరులకు కట్టుబడి ఉంది కూడా.. నాకొక నోటీస్ వచ్చింది. ఫలానా తారీఖున వస్తానని రిప్లై ఇచ్చాను.. సినిమా వర్క్ ఉండటం వెళ్లటం అవ్వలేదు. నిర్మాతకు నష్టం వస్తుందనే విచారణకు మరలా టైమ్ అడిగాను.. ఇదేమి అర్జెంట్ కేసు కాదు. వన్ ఇయర్ బ్యాక్ ట్వీట్ చూసిన వాడికి.. వన్ వీక్‌లో అంతా అయిపోవాలని ఎమన్నా ఫీలింగ్ ఉంటుందా.. మర్డర్ కేసులకే సంవత్సరాల సంవత్సరాల సమయం తీసుకుని.. నా కేసులో ఎందుకు అత్యవసరంగా వ్యవహరిస్తున్నారంటూ రాంగోపాల్ వర్మ ప్రశ్నించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

16 యేళ్లలోపు పిల్లలను సోషల్ మీడియాకు దూరంగా ఉంచాల్సిందే...