Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

16 యేళ్లలోపు పిల్లలను సోషల్ మీడియాకు దూరంగా ఉంచాల్సిందే...

social media Maniacs

ఠాగూర్

, బుధవారం, 27 నవంబరు 2024 (10:08 IST)
ఆస్ట్రేలియా ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. చిన్నారులపై సోషల్ మీడియా ప్రభావం ఎంతగానో ఉంది. దీంతో ఆ దేశ పాలకులు సంచలన నిర్ణయం తీసుకున్నారు. 16 యేళ్లలోపు చిన్నారులను సోషల్ మీడియాకు దూరంగా ఉంచేలా ఓ బిల్లును తీసుకొచ్చి ఆమోదించారు. ఈ బిల్లుకు 103 ఓట్లతో ప్రతినిధుల సభ ఆమోదముద్ర వేసింది. ఇకపై సెనేట్ గ్రీన్ సిగ్నల్ ఇస్తే.. ఇది చట్టంగా రూపాంతరం చెందనుంది. ఆ వెటనే సామాజిక మాధ్యమాలకు ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీచేయనుంది. అయితే, ఈ బిల్లులను 13 మంది సభ్యులు వ్యతిరేకించారు. 
 
సెనేట్‌లో బిల్లుకు ఆమోదం లభించిన వెంటనే చట్ట రూపం దాల్చుతుంది. ఆ వెంటనే సామాజిక మాధ్యమాలపై ప్రభుత్వం ఆదేశాలు జారీచేస్తుంది. కొత్త చట్టం అమలు బాధ్యత సామాజిక మాధ్యమాలదేనని, తల్లిదండ్రులు ఫిర్యాదు ఆధారంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆస్ట్రేలియా ప్రధాని ఆంటోనీ అల్బనీస్ వెల్లడించారు. కాగా, బిల్లు చట్ట రూపం దాల్చితే సోషల్ మీడియాపై నిషేధం విధించిన తొలి దేశంగా ఆస్ట్రేలియా రికార్డుకెక్కనుంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఢిల్లీలో పవన్ కళ్యాణ్ 'తుఫాన్' - నేడు ప్రధాని మోడీతో భేటీ!!