Publish Date: Sat, 15 Apr 2023 (19:27 IST)
Updated Date: Sat, 15 Apr 2023 (19:31 IST)
ఎండలు మండిపోతున్న వేళ.. ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్. పీలో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఉపరితల ద్రోణి ప్రభావంతో ఏపీలో అక్కడక్కడ మోస్తరు వర్షాలు పడే అవకాశం వుందని తెలిపింది. కొన్ని చోట్ల జల్లులు పడే అవకాశం వుందని వాతావరణ కేంద్రం పేర్కొంది.
ఉత్తర ఛత్తీస్‌గఢ్ నుంచి కేరళ వరకు ఉపరితల ద్రోణి వ్యాపించి ఉంది. అలాగే జార్ఖండ్ నుంచి ఏపీ మీదుగా తమిళనాడు వరకు సముద్రమట్టానికి 0.9 కిమీ ఎత్తులో మరో ఉపరితల ద్రోణి కొనసాగుతోందని వివరించింది. దీంతో ఏపీలో వర్షాలు కురిసే అవకాశం వుందని వాతావరణ శాఖ తెలిపింది.