కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తిరులలో రికార్డు సృష్టించారు. అలిపిరి నుంచి తిరుమల కొండపైకి కేవలం గంట యాభై నిమిషాల్లో కాలినడకన చేరుకున్నారు. ఇంత తక్కువ సమయంలో తిరుమలకు చేరుకున్న మొదటి రాజకీయ నాయకుడిగా రాహుల్ గాంధీ రికార్డ్ సృష్టించారు.
కాలినడకన వెళుతున్న సమయంలో భక్తులతో కరచాలనం చేస్తూ చిరునవ్వుతో పలకరించారు. దారి పొడవునా రాహుల్ గాంధీతో కరచాలనం చేసేందుకు భక్తులు పోటీపడ్డారు. తిరుమలలో పంచకట్టులో అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తూ సాంప్రదాయ దుస్తుల్లో దర్శనానికి వెళ్ళారు.
స్వామివారి దర్శనం అనంతరం శ్రీకృష్ణ గెస్ట్ హౌస్ నుంచి బయలుదేరి రోడ్డు మార్గం ద్వారా జ్యోతిరావు పూలే సర్కిల్‌కు రాహుల్ చేరుకుని అక్కడ నుంచి తారకరామ స్టేడియం వరకు బస్ యాత్ర చేస్తారు. అనంతరం తారకరామ స్టేడియంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో రాహుల్ ప్రసంగిస్తారు. 2014 ఎన్నికల సమయంలో మోడీ సభ నిర్వహించిన ప్రాంగణంలోనే ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ సభ నిర్వహిస్తున్నారు.