Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Ragging: సిద్ధార్థ కాలేజీ హాస్టల్ ర్యాంగింగ్.. చితకబాది.. కాళ్లతో తన్నారు.. వీడియో వైరల్

Advertiesment
Ragging

సెల్వి

, శనివారం, 27 సెప్టెంబరు 2025 (20:06 IST)
Ragging
ర్యాంగింగ్ నియంత్రించేందుకు ఎన్ని చట్టాలు వచ్చినా.. దానికి అడ్డుకట్ట వేయలేకపోతున్నారు. తాజాగా తిరుపతిలోని సత్యవీడు సిద్ధార్థ కాలేజీ హాస్టల్ ర్యాగింగ్ కలకలం సృష్టించింది. ఓ విద్యార్థిపై తోటి విద్యార్థులు దారుణంగా వ్యవహరించారు. తోటి విద్యార్థిని చితకబాది.. కాళ్లతో తన్నుతూ దాడి చేశారు. ఈ ఘటనను వీడియో కూడా తీశారు. 
 
ఈ వీడియో కాస్త నెట్టింట వైరల్ అవుతోంది. వద్దు వద్దు అని ఆ విద్యార్థి వేడుకున్నా.. తోటి విద్యార్థులు రౌడీల్లా ప్రవర్తిస్తున్నారు. ఈ కాలేజీ బీజేపీ నేతకు చెందినదిగా స్థానికులు చెబుతున్నారు. 
 
ర్యాగింగ్ భూతానికి ఎందరో విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. ఈ కాలేజీ బీజేపీ నేతకు చెందినదిగా స్థానికులు చెబుతున్నారు. అధికారులు దీనిపై స్పందించి సదరు విద్యార్థులపై కఠిన చర్యలు తీసుకుని, భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకుండా చూడాల్సిన బాధ్యత ఉందని బాధితుడి తల్లిదండ్రులు కోరుతున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

Future City: 30వేల ఎకరాల భూమిలో త్వరలో ప్రారంభం కానున్న ఫ్యూచర్ సిటీ