ఏపీలోని తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో ఒళ్లు గుగుర్పొడిచే ఘటన ఒకటి జరిగింది. జిల్లాలోని తొట్టంబేడు మండలం చియ్యవరంలో ఓ వ్యక్తి పాము కాటేసిందని దాని తల కొరికి పక్కలో పెట్టుకుని నిద్రపోయాడు.
స్థానికులు వెల్లడించిన వివరాల మేరకు... గురువారం రాత్రి మద్యం మత్తులో ఉన్న వెంకటేశ్ అనే వ్యక్తిని నల్లత్రాసు కాటేసింది. మద్యం తాగి ఇంటి వెళుతున్న సమయంలో పాము కాటేయడంతో వెంటనే దాన్ని పట్టుకుని తలకొరికేశాడు. ఆ తర్వాత చనిపోయిన పామును ఇంటికి తీసుకెళ్ళి పక్కనే పెట్టుకుని నిద్రపోయాడు.
గురువారం అర్థరాత్రి దాటాక ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో వెంకటేశ్‌ను హుటాహుటిన కుటుంబ సభ్యులు హుటాహుటిన శ్రీకాళహస్తి ఏరియా ఆస్పత్రికి తరలించారు. అక్కడ నుంచి తిరుపతి రుయా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిసున్నారు.