Publish Date: Wed, 13 Mar 2019 (18:31 IST)
Updated Date: Wed, 13 Mar 2019 (18:32 IST)
ప్రముఖ నిర్మాత పొట్లూరి వరప్రసాద్(పీవీపీ) తాజాగా వైకాపా తీర్థం పుచ్చుకున్నారు. మల్లాది విష్ణుతో కలిసి ఉదయాన్నే లోటస్‌పాండ్‌కు చేరుకున్న ఆయన వైకాపా అధినేత జగన్‌తో భేటీ అనంతరం వైకాపాలో చేరినట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రజలకు సేవ చేసేందుకే రాజకీయాలలోకి వచ్చానని అన్నారు.
విజయవాడ పార్లమెంట్ నుండి వైకాపా తరఫున పోటీ చేయబోతున్నానని స్పష్టం చేసిన పీవీపీ పవన్ కళ్యాణ్‌తో పాటు అందరూ తన మిత్రులేననీ.. జగన్‌తోనే ప్రజలకు మేలు జరుగుతుంది అని నమ్ముతున్నానని పీవీపీ తెలియజేసారు.