Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

సీఎం చంద్ర‌బాబుకి రుణ‌ప‌డి ఉంటాను : తితిదే ఛైర్మన్ పుత్తా సుధాక‌ర్

తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) బోర్డు ఛైర్మన్‌గా కడప జిల్లాకు చెందిన పుత్తా సుధాకర్ యాదవ్ నియమితులయ్యారు. దీనిపై ఆయన స్పందిస్తూ, తనను తితిదే ఛైర్మన్‌గా నియమించినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబుకు రుణపడి

Advertiesment
సీఎం చంద్ర‌బాబుకి రుణ‌ప‌డి ఉంటాను : తితిదే ఛైర్మన్ పుత్తా సుధాక‌ర్
, బుధవారం, 11 ఏప్రియల్ 2018 (09:00 IST)
తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) బోర్డు ఛైర్మన్‌గా కడప జిల్లాకు చెందిన పుత్తా సుధాకర్ యాదవ్ నియమితులయ్యారు. దీనిపై ఆయన స్పందిస్తూ, తనను తితిదే ఛైర్మన్‌గా నియమించినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబుకు రుణపడి ఉంటానని చెప్పారు. ఓ సామాన్య భక్తుడిలా శ్రీవారికి సేవలు చేస్తానని వెల్లడించారు. 
 
గతంలో పాలక మండలి సభ్యునిగా పని చేసిన అనుభవం ఛైర్మన్‌గా కొత్త నిర్ణయాలు తీసుకోవడానికి ఉపయోగపడుతుందన్నారు. బుధవారం మధ్యాహ్నం విజయవాడకు వెళ్లి ముఖ్యమంత్రి కృతజ్ఞతలు తెలియజేస్తానని తెలిపారు. అలాగే, త్వరలో మంచి ముహూర్తం చూసుకుని బాధ్యతలు స్వీకరిస్తానని తెలిపారు. పాలకమండలి సభ్యుల నియామకం తర్వాత తితిదే ఆర్థిక పరిస్థితిపై దృష్టి పెడతానని, దేవస్థానంలో ఉద్యోగులకు ఎవ్వరికి అన్యాయం జరగకుండా కొక్త పాలక మండలి నిర్ణయాలు తీసుకుంటుందని ఆయన తెలిపారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నాది అలవాటైన ప్రాణం... ఆమరణ దీక్ష చేస్తున్న వైయస్సార్‌సీపీ ఎంపీలతో జ‌గ‌న్