Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

బీజేపీ-జనసేన పొత్తుపై పురందేశ్వరి ఏమన్నారంటే?

purandeswari
, బుధవారం, 6 ఏప్రియల్ 2022 (13:57 IST)
బీజేపీ-జనసేన పొత్తుపై మిత్రపక్షంగా జనసేనాని పవన్ కల్యాణ్ మాతో చర్చిస్తే.. మేము కూడా స్పందిస్తామని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి పురందేశ్వరి అన్నారు. ఏపీలో కార్యక్రమాలు వేరైనా.. బీజేపీ-జనసేన పొత్తు కొనసాగుతుందన్నారు.
 
ఏపీలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పార్టీ ఆవిర్బావ వేడుకల్లో పాల్గొన్న సందర్భంగా పురంధరేశ్వరి మాట్లాడుతూ.. విశాఖ ఉక్కు విషయంలో వైసీపీ నాయకులకు బీజేపీని తప్పు పట్టే అర్హత లేదన్నారు. 
 
ఉక్కు ఫ్యాక్టరీ విషయంలో ప్రజల ఆకాంక్షలను కేంద్ర పెద్దలకు వివరిస్తామన్నారు. పెట్రోల్, డీజిల్ ఛార్జీల విషయంలో కేంద్రం తన వంతు బాధ్యతగా ధరలు తగ్గించింది. రాష్ట్ర ప్రభుత్వం పన్నుల విషయంలో ఎందుకు తగ్గించడం లేదని ప్రశ్నించారు. 
 
ఉక్రెయిన్ యుద్ధం వల్ల ఇప్పుడు పెట్రోల్ రేట్లు పెరిగాయన్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో నాలుగు రాష్ట్రాల్లో బీజేపీకి పట్టం కట్టారు. ఉత్తరప్రదేశ్‌లో రెండో సారి అధికారం ఇవ్వడం అంటే బీజేపీ పాలనపై ప్రజలకు ఉన్న నమ్మకం ఏంటో అర్థమవుతోందని తెలిపారు. 
 
మోడీ ప్రధానిగా ఎనిమిదేళ్ళ కాలంలో ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు. దేశంలో పేదల అభ్యున్నతికి కృషి చేశారు. ప్రతి కార్యకర్త కూడా పార్టీ గెలుపు కోసం పని చేయాలని పిలుపునిచ్చారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తెలంగాణ గవర్నర్ తమిళసైని రాష్ట్రపతి పదవి వరించనున్నదా? ప్రధాని ఏం చెప్పారు?