Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఎండ తీవ్రంగా ఉన్నపుడు తీసుకోవలసిన జాగ్రత్తలు

Advertiesment
ఎండ తీవ్రంగా ఉన్నపుడు తీసుకోవలసిన జాగ్రత్తలు
, శుక్రవారం, 22 మే 2020 (08:01 IST)
రోజురోజుకు వేసవి తీవ్రత పెరిగిపోతోంది. ఎండ వేడిమి అల్లాడిస్తోంది. ఈ నేపథ్యంలో ఏమేం చేయాలి? ఏమేం చేయకూడదు అన్న అంశాలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ ఒక ప్రకటనలో విడుదల చేసింది. ఆ వివరాలు...
 
చేయవలసినవి:
▶ వేడిగా ఉన్న రోజులలో తప్పనిసరిగా గొడుగు వాడాలి.
▶ తెలుపురంగు గల పలుచటి కాటన్ వస్త్రాలను ధరించాలి.
▶ నెత్తికి టోపీ, లేదా రుమాలు పెట్టుకోవాలి.
▶ ఉప్పు కలిపిన మజ్జిగ లేదా గ్లూకొజు కలిపిన నీరు త్రాగవచ్చును, లేదా ఓరల్ రి హైడ్రేషన్ ద్రావణము త్రాగవచ్చును.
▶ వడదెబ్బకు గురి అయినవారిని శీతల ప్రాంతానికి వెంటనే చేర్చాలి.
▶ వడదెబ్బకు గురి అయినవారని తడిగుడ్డతో శరీరం అంతా రుద్దుతూ ఉండాలి. ఐస్ నీటిలో బట్టను ముంచి శరీరం అంతా తుడవవలెను శరీర ఉష్ణోగ్రత 101F – డిగ్రీస్  కంటే లోపునకు వచ్చేవరకు ఐస్ వాటర్ బట్టతో శరీరాన్ని తుడుస్తూ ఉండాలి మరియు ఫ్యాను క్రింద ఉంచాలి. 
▶ వడదెబ్బకు గురి అయినవారిలో మంచి మార్పులు లేనిచో శీతల వాతావరణంలో దగ్గరలోని ప్రాధమిక ఆరోగ్య కేంద్రానికి తరలించవలెను.
▶ మంచి నీరు ఎక్కువ సార్లు త్రాగాలి.
▶ ఇంటి నుంచి బయటకు వెళ్ళేముందు ఒక గ్లాసుమంచి నీరు త్రాగాలి.
▶ ఎండలో బయటి నుంచి వచ్చిన వెంటనే ఒక మాదిరైన చల్లని నిమ్మరసముగాని, కొబ్బరి నీరు లేదా చల్లని నీరు త్రాగాలి.
▶ తీవ్రమైన ఎండలో బయటకి వెళ్ళినప్పుడు తలతిరుగుట మొదలైన అనారోగ్య సమస్య ఏర్పడితే దగ్గరలో వున్నా వైద్యుణ్ణి సంప్రదించి ప్రాధమిక చికిత్స పొంది వడ దెబ్బ బారిన పడకుండా కాపాడుకోవచ్చును.
 
చేయకూడనివి:
▶ సూర్య కిరణాలకు, వేడి గాలికి గురి కాకుడదు.
▶ వేడిగా ఉన్న సూర్య కాంతిలో గొడుగు లేకుండా తిరుగరాదు.
▶ వేసవి కాలంలో నలుపురంగు దుస్తులు, మందంగా ఉండే దుస్తులు ధరించరాదు.
▶ నెత్తికి టోపి లేక రుమాలు లేకుండా సూర్య కాంతిలో తిరుగరాదు.
▶ వడదెబ్బకు గురి అయిన వారిని వేడి నీటిలో ముంచిన బట్టతో తుడువరాదు. దగ్గరలోని ప్రాధమిక అరోగ్య కేంద్రానికి చేర్చుటలో ఏ మాత్రం అలస్యం చేయరాదు.
▶ మధ్యాహ్నం తరువాత (అనగా ఉదయం 10.00 గంటల నుండి సాయంత్రం 4.00 గంటల మధ్యకాలంలో) ఆరుబయట ఎక్కువ శారీరక శ్రమతో కూడిన పని పనిచేయరాదు.
▶ ఎండలో బయట నుంచి వచ్చిన వెంటనే తీపిపదార్ధములు మరియు తేనె తీసుకొన కూడదు. శీతలపానీయములు, మంచు ముక్కలు తీసుకుంటే గొంతుకు సంబంధించిన అనారోగ్యము ఏర్పడుతుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నా భర్త శృంగారం చేస్తూ ఊపిరాడకుండా చేస్తున్నాడు, కాపాడండి, భార్య ఫిర్యాదు