Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఏపీలో అధికార వైకాపా ఎంపీటీసీ అదృశ్యం

ఏపీలో అధికార వైకాపా ఎంపీటీసీ అదృశ్యం
, బుధవారం, 22 సెప్టెంబరు 2021 (08:54 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత ఆదివారం ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ఫలితాలు వెల్లడయ్యాయి. ఈ ఎన్నికల ఫలితాల్లో అధికార వైకాపా విజయభేరీ మోగించింది. అయితే, ప్రకాశం జిల్లా యనమదల వైసీపీ ఎంపీటీసీ శాంసన్ అదృశ్యమయ్యారు. ఈ ఘటన స్థానికంగా సంచలనమైంది. 
 
ఆయన భార్య పరమగీతం ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు శాంసన్ కోసం గాలిస్తున్నారు. యద్దనపూడి ఎంపీపీ పదవి కోసం వైసీపీలో రెండు వర్గాలు తీవ్రంగా పోటీపడుతున్నాయి. 
 
ఈ నేపథ్యంలో శాంసన్ అకస్మాత్తుగా కనిపించకుండా పోవడం పార్టీలో చర్చనీయాంశమైంది. తన భర్త శాంసన్ సోమవారం నుంచి కనిపించడం లేదంటూ ఆయన భార్య యద్దనపూడి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తెలంగాణలో ఇక జూనియర్ కళాశాలలుగా కస్తూర్బా విద్యాలయాలు