Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఎన్‌కౌంటర్ జరిగిన దగ్గరే పోస్ట్‌మార్టం...

Advertiesment
ఎన్‌కౌంటర్ జరిగిన దగ్గరే పోస్ట్‌మార్టం...
, శుక్రవారం, 6 డిశెంబరు 2019 (13:30 IST)
పశువైద్యురాలు దిశ నిందితలను పోలీసులు ఎన్‌కౌంటర్ చేశారు. హైదరాబాద్‌లో డాక్టర్ చంపిన నిందితులను పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. సీన్ రీకనస్ట్రక్షన్ కోసం శుక్రవారం నిందితులను చటాన్‌పల్లిలోని ఘటన జరిగిన స్థలానికి తీసుకువెళ్లారు. అక్కడ నుంచి నిందితులు పారిపోవడానికి ప్రయత్నించడంతో.. చేసేది ఏంలేక పోలీసులు నిందితులపై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో నలుగురు నిందితులు అక్కడికక్కడే చనిపోయారు. 
 
కాగా.. ఈ వార్త దావానంలా వ్యాపించింది. జనాలు తండోపతండాలుగా సంఘటనా స్థలానికి చేరుకున్నారు. సంఘటన స్థలంలో సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్, డిసిపి ప్రకాష్ రెడ్డి, ఏసీపీ సురేందర్, సిఐ శ్రీధర్ కుమార్ జిందాబాద్ అంటూ జనాలు నినాదాలు చేస్తున్నారు. ఎన్‌కౌంటర్ జరిగినందుకు జనాల సంతోషానికి అవధులు లేకుండాపోయాయి. 
 
44వ నంబర్ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్‌జామయింది. జనాన్ని కంట్రోల్ చేయడం పోలీసులకు పెద్ద సమస్యగా మారింది. సంఘటనా స్థలంలో తెలంగాణ సీఎం కేసీఆర్ జిందాబాద్ అనే నినాదాలు కూడా ఊపందుకున్నాయి. అయితే ప్రజలు ఎక్కువ సంఖ్యలో ఘటనా స్థలికి రావడంతో నిందితుల మృతదేహాలకు స్పాట్‌లోనే పోస్టుమార్టమ్ నిర్వహించాలని పోలీసులు భావిస్తున్నారు.

ఇప్పటికే అక్కడికి ఆర్డీవో, తహసీల్దార్ చేరుకున్నారు. రెవిన్యూ అధికారుల సమక్షంలోనే శవపంచనామా నిర్వహిస్తున్నారు. ఫోరెన్సిక్ నిపుణులు, డాక్టర్ల బృందం కాసేపట్లో అక్కడికి చేరుకునే అవకాశముంది. ఆ తర్వాత నిందితుల మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహిస్తారని తెలుస్తోంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సెల్‌ఫోన్ కొంటే ఉల్లిపాయలు ఫ్రీ.. ఎక్కడో తెలుసా?