Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

1,056 మద్యం బాటిళ్ల స్వాధీనం..ఎక్కడ?

Advertiesment
liquor bottles
, శుక్రవారం, 19 జూన్ 2020 (21:30 IST)
మచిలీపట్నం ఎస్పీ రవీంద్రనాథ్ బాబు ఆదేశాల మేరకు ఇతర రాష్ట్రాల నుండి జిల్లాలోకి అక్రమ మద్యం చొరబడకుండా, సరిహద్దు ప్రాంతాలలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. నిత్యం వాహన తనిఖీలను ముమ్మరం చేశారు.

కొంతమంది అక్రమ ధనార్జనే ధ్యేయంగా పెట్టుకుని నేరాలు చేస్తున్నారు. అక్రమ మద్యం రవాణాకు పూనుకుని పోలీసుల వలకు చిక్కుతున్నారు.

తెలంగాణలోని ఖమ్మం జిల్లా పందిలపల్లి గ్రామానికి చెందిన దివ్యభారతి, మల్లేశ్వరి అనే ఇద్దరు మహిళలు, ఆ చుట్టు పక్కల ప్రాంతాలలో మద్యం బాటిళ్లు కొనుగోలు చేసి టాటా ఇండికా కారులో 20 కేసులలో మొత్తం 1056 మద్యం బాటిల్ ఎక్కించి వాటిని నందిగామ తరలించే క్రమంలో శుక్రవారం తెల్లవారు జామున పోలీసులకు పట్టుబడ్డారు.

పోలీసు ప్రత్యేక బృందం ఎస్ఐ మురళీకృష్ణ, సాండ్ మొబైల్ పార్టీ సిబ్బందితో కలసి వత్సవాయి పోలీస్ స్టేషన్ పరిధిలోని పెంట్యాలవారి గూడెం వద్ద కాపు కాసి వాహన తనిఖీలు చేస్తున్న నేపథ్యంలో అక్రమ మద్యాన్ని కారులో తరలిస్తున్న వాహన డ్రైవర్ పోలీసులను చూసి పారిపోయారు.

పోలీసులు కారును తనిఖీ చేయటంతో 1,056 మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు మహిళలను వత్సవాయి పోలీస్ స్టేషన్ కు తరలించారు. వారిరువురిపై వత్సవాయి పోలీస్ స్టేషన్లో  ఎక్సైజ్ కేసు నమోదు చేశారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వైసీపీలో 'రాజ్యసభ' సంబరం