రెండు వారాల ముందు దారుణ హత్యకు గురైన ప్రముఖ వ్యాపారవేత్త చిగురుపాటి జయరాం హత్య కేసులో 11 మంది పోలీసు అధికారుల ఇన్వాల్వ్‌మెంట్ ఉన్నట్లు తెలుస్తోంది. కేసులో ప్రధాన నిందితుడుగా ఉన్న రాకేష్‌రెడ్డితో వీరందరూ కొన్నాళ్లుగా టచ్‌లో ఉన్నారట. హత్యానంతరం రాకేష్ రెడ్డి 11 మంది పోలీసు అధికారులను సంప్రదించాడట.
వీరిలో నలుగురు డీఎస్పీలు, నలుగురు ఇన్స్‌పెక్టర్‌లు ఉన్నారట. కాగా హత్య నుండి తప్పించుకోవడానికి నల్లకుంట ఇన్స్‌పెక్టర్, ఏసీపీలు రాకేష్ రెడ్డికి ప్లాన్ ఇచ్చారు. ప్రస్తుతం శిఖా చౌదరి సైతం విచారణకు హాజరయ్యారు.
ఈ నేపథ్యంలో 11 మంది పోలీసు అధికారుల పాత్రపై కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. కేసు ఎలా మలుపు తిరుగుతుందో చూడాలంటే కొన్నాళ్లు ఆగాల్సి ఉంటుంది. పూర్తి విచారణ ముగిసే వరకు హత్యకు సంబంధించి ఎలాంటి క్లారిటీ వచ్చేలా లేదు.