Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Tuesday, 29 July 2025
webdunia

సీఎం జగ్‌కు ఫోన్... గులాబ్‌పై ఆరా తీసిన ప్రధాని మోడీ

Advertiesment
PM Modi
, ఆదివారం, 26 సెప్టెంబరు 2021 (17:19 IST)
ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆదివారం ఫోన్ చేశారు. తన మూడు రోజుల అమెరికా పర్యటన నుంచి తిరిగి స్వదేశానికి చేరుకున్న తర్వాత ప్రధాని మోడీ గులాబ్ తుఫానుపై దృష్టిసారించారు. ఈ తుఫాను ఏపీలోని శ్రీకాకుళం జిల్లాలో తీరందాటనుంది. దీంతో ఏపీ సీఎం జగన్‌కు పీఎం మోడీ ఫోన్ చేసి ‘గులాబ్‌’ తుఫాను పరిస్థితిపై ఆరా తీశారు. 
 
ఆంధ్రప్రదేశ్‌లో తుఫాను పరిస్థితిపై ముఖ్యమంత్రి జగన్‌తో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. కేంద్రం నుంచి సహాయాన్ని తక్షణం అందేటట్లు చూస్తామని ప్రధాని హామీ ఇచ్చారు. అందరూ క్షేమంగా ఉండాలని దేవుడిని ప్రార్థిస్తున్నట్టు ప్రధాని ట్విటర్‌ ద్వారా వెల్లడించారు.
 
బంగాళాఖాతంలో ఏర్పడిన ‘గులాబ్‌’ తుఫాను తీరంవైపు కదులుతోంది. ఒడిశాలోని గోపాల్‌పూర్‌కు 140 కి.మీ, ఏపీలోని కళింగపట్నానికి 190 కి.మీ దూరంలో కేంద్రీకృతమై పశ్చిమ దిశగా ముందుకెళ్తోంది. తుఫాను ప్రభావంతో శ్రీకాకుళం జిల్లాలో వాతావరణ పరిస్థితులు మారుతున్నాయి. 
 
జిల్లా అంతటా ఆకాశం మేఘావృతం కావడంతో పాటు పలుచోట్ల తేలికపాటి వర్షం పడుతోంది. ఇచ్ఛాపురం, కవిటి, సోంపేట, పలాస తదితర ప్రాంతాల్లో చిరుజల్లులు కురుస్తున్నాయి. ఈరోజు అర్ధ రాత్రికి కళింగపట్నం-గోపాల్‌పూర్‌ మధ్య తుఫాను తీరం దాటే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. తీరం దాటే సమయంలో 75-90 కి.మీ వేగంతో గాలులు వీచే అవకాశముంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వాంఛ తీర్చాలన్న తండ్రి.. కడతేర్చిన కుమార్తె.. ఎక్కడ?