భారత ప్రధాని మోదీ సరికొత్త రికార్డును సృష్టించారు. ఆయన ఏకంగా ముగ్గురు అమెరికా అధ్యక్షులతో భేటీ అయిన భారత ప్రధానిగా చరిత్రకెక్కారు. ప్రస్తుతం ప్రధాని మోదీ అమెరికా పర్యటనలో ఉన్నారు. ఆయన అమెరికా కొత్త అధ్యక్షుడు జో బైడెన్ ని తొలిసారి ప్రత్యక్షంగా కలిశారు. ఇద్దరూ స్నేహపూర్వకంగా ఆలింగనం చేసుకున్నారు. భారత దేశంతో అమెరికాకు ఉన్న ప్రాచీన సంబంధ బాంధవ్యాలను నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కి గుర్తు చేశారు. ఇరు దేశాల మధ్య సహృద్భావ వాతావరణం కొనసాగుతుందని పరస్పరం అవగాహనతో మెలగాలని సూచించారు.
భారత ప్రధానిగా మోదీ రెండో సారి ఎన్నిక అయ్యారు. ఇంతకుముందు ఆయన డోనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా ఉండగా, ఆయనతో భేటీ అయ్యారు. ఆయన ఎన్నికలకు ముందు మోదీ ఘనంగా స్వాగతం కూడా పొందారని, ఇది భారతీయుల ఓట్ల కోసమే అని విమర్శలు కూడా వచ్చాయి. అంతకు ముందు అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాతో కూడా నరేంద్ర మోదీ భేటీ అయ్యారు. ముగ్గురు అమెరికన్ ప్రెసిడెంట్లను భారత ప్రధాని హోదాలో నరేంద్ర మోదీ కలవడం, చర్చలు జరపడం విశేషం.