Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కొడాలి నానీ శరీరమే డ్రైనేజీ వ్యవస్థకు ప్రతిరూపం: పిల్లి మాణిక్యరావు

Advertiesment
కొడాలి నానీ శరీరమే డ్రైనేజీ వ్యవస్థకు ప్రతిరూపం:  పిల్లి మాణిక్యరావు
, సోమవారం, 7 డిశెంబరు 2020 (23:03 IST)
రాష్ట్రప్రజలు ప్రతిరోజు అనేకసమస్యలతో సతమతమవుతు న్నారని, నిత్యం ఏదోఒకప్రమాదం, విపత్తు, అనుకోని సంఘటనలు జరుగుతున్నా కొడాలినాని వంటివారికి బుద్ధి ఉండటంలేదని, రాష్ట్రంలోని సమస్యలను, ప్రజలఅవస్థలను పట్టించుకోకుండా సదరు వ్యక్తి మతిలేకుండా మాట్లాడుతున్నాడని టీడీపీ రాష్ట్ర అధికారప్రతినిధి పిల్లి మాణిక్యరావు మండిపడ్డారు.

సోమవారం ఆయన తననివాసం నుంచి జూమ్ యాప్ ద్వారా విలేకరులతో మాట్లాడారు. ఏలూరులో ప్రజలు అంతుచిక్కనివ్యాధితో ఆసు పత్రుల పాలయ్యారని, అక్కడున్నవారి ఆరోగ్యంపై రాష్ట్రమంతా తీవ్రంగా ఆందోళన చెందుతోందని, ఈక్రమంలో టీడీపీ జాతీయప్రధాన కార్యదర్శి నారాలోకేశ్ అక్కడివారిని పరామర్శించ డం జరిగిందన్నారు.  ప్రభుత్వం కూడా త్వరగా చర్యలు తీసుకోవాలని, హెల్త్ ఎమర్జన్సీ ప్రకటించాలని ఆయన డిమాండ్ చేయడం జరిగిందన్నారు.

ప్రతిపక్షం సూచనలను, ప్రజల సమస్యలను పట్టించుకోకుండా ప్రభుత్వం నానీ అనేపనికిమాలిన వ్యక్తిని ప్రోత్సహిస్తోందని మాణిక్యరావు దుయ్యబట్టారు. రాష్ట్రంలో సమస్యలు తలెత్తిన ప్రతిసారీ కొడాలినానీ మీడియాముందుకొచ్చి పందికంటే హీనంగా ప్రవర్తిస్తూంటాడన్నారు. అటువంటి పనికిమా లిన వెధవ శరీరం మొత్తం ఢ్రైనేజీ వ్యవస్థకన్నా దారుణంగా తయారైందని టీడీపీనేత ఆగ్రహం వ్యక్తంచేశారు.

నానీ నరనరాన మురికికూపమే ఉందని, మనిషి శరీరంలో మలినం ఉంటే, నానీ లానే ప్రవర్తిస్తారని, ఆయన నోటిలో డ్రైనేజీలో ఉండే వ్యర్థాలన్నీ ఉన్నాయని, అందుకే ఆనోటిని ఇష్టమొచ్చినట్లు వాడుతున్నా డన్నారు. తనమంత్రి పదవిని కాపాడుకోవడం కోసమే నానీ, ప్రతిసారీ తన డ్రైనేజీ నోటిని తెరుస్తున్నాడన్నారు.

ఏలూరు సమస్య గురించి తెలియక వైద్యులంతా తలలు పట్టుకుంటుంటే,   మంత్రులు  చంద్రబాబుని, టీడీపీనేతలను విమర్శిస్తూ కాలక్షేపం చేస్తున్నారన్నారు.  నానీ తన గబ్బునోటిని అదుపులో పెట్టుకోకుం టే, బాధ్యతగా ప్రవర్తించకుంటే, ప్రజలే తగినశాస్తి చేస్తారన్నారు. జగన్ కోడికత్తి డ్రామా ఆడితే, పేర్నినానీ దానికంటే గొప్పగా తాపీ డ్రామా ఆడాడన్నారు. 

వైద్యఆరోగ్యశాఖా మంత్రి ఆళ్లనాని  సొంతనియోజకవర్గంలోని ప్రజలుచెప్పుకోలేని సమస్యతో మూర్ఛల తో, నోటివెంట నురగలుకక్కుతూ పడిపోతుంటే, ప్రజలంతా పోలోమంటూ రోదిస్తుంటే, సమస్య ఏమిటో తెలియడం లేదని సదరు మంత్రి చెప్పడం సిగ్గుచేటన్నారు.  కొడాలినానీ నరనరాల్లో మలినమే ప్రవహిస్తోందని, అందుకే చంద్రబాబుపై అవాకులు చెవాకులు పేలుతున్నాడన్నారు.

అసలు డ్రైనేజీలో పడుకోబెట్టాల్సింది వైసీపీప్రభుత్వాన్ని, రాష్ట్ర మంత్రులను అనే విషయాన్ని కొడాలినానీ తెలుసుకుంటే మంచిదన్నారు. రాష్ట్రంలోని సమస్యలనుంచి ప్రజలను పక్కదారి మళ్లించడానికే  నానీ ప్రభుత్వం తరుపున కుక్కలా పనిచేస్తున్నాడన్నారు.  నానీ అసలు మనిషి పుట్టుకే పుట్టాడా అన్న సందేహం ప్రజలకు కలుగుతోందని,  151 సీట్లు ఉన్నంతమాత్రాన చిన్నాపెద్దా, సభ్యత-సంస్కారం, మంచి-మర్యాద లేకుండా ప్రవర్తిస్తారా అని మాణిక్యరావు నిలదీశా రు. 

చంద్రబాబుని అనే ప్రతిమాటకు నానీ అంతకుఅంత అనుభవించి తీరుతాడని టీడీపీనేత తేల్చిచెప్పారు. కుట్రలు, కుతంత్రాలతో ప్రజలను పక్కదారి  పట్టిస్తున్న ప్రభుత్వం, తన మంత్రుల అసమర్థతను, చేతగానితనాన్ని కప్పిపుచ్చాలని చూస్తోందన్నారు. తననియోజకవర్గంలోని సమస్య ఏమిటో గుర్తించడం చేతగాని ఆళ్లనాని తక్షణమే తనమంత్రిపదవికి రాజీనామా చేయాలని మాణిక్యరావు డిమాండ్ చేశారు.

వారివారి శాఖలకు సంబంధించి, మంత్రులు పూర్తిగా విఫలమైనా వారెవరూ నీతివంతంగా, ధైర్యంగా  బాధ్యత తీసుకోవడం లేదన్నారు. నానీ తనపద్ధతి మార్చుకోవాలని లేకుంటే ఆయన గబ్బునోరే ఆయనకు సమస్యలు తెచ్చిపెడుతుందని మాణిక్యరావు తీవ్రస్వరంతో హెచ్చరించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పీపీఈ కిట్లు ధరించి పెళ్లి చేసుకున్న వధూవరులు