Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

వర్క్ ఫ్రమ్ హోమ్.. జూమ్ కోర్టు.. శృంగారంలో న్యాయవాది.. షాకైన జడ్జి

Advertiesment
వర్క్ ఫ్రమ్ హోమ్.. జూమ్ కోర్టు.. శృంగారంలో న్యాయవాది.. షాకైన జడ్జి
, మంగళవారం, 2 ఫిబ్రవరి 2021 (12:00 IST)
లాక్ డౌన్ కారణంగా పలువురు ఉద్యోగులు వర్క్ ఫ్రమ్ హోం చేస్తున్నారు. అయితే వర్క్ ఫ్రమ్ హోం సవాలుగా మారింది. ఫ్యామిలీ టైంను, ఆఫీస్ టైంను బ్యాలెన్స్ చేయలేక పలువురు ఉద్యోగులు సతమతమవుతున్నారు. ఇక ఆఫీస్ వర్క్ నిమిత్తం వీడియో కాల్స్‌లో సంభాషణల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 
 
తాజాగా ఓ వ్యక్తి సిగ్గుమాలిన పని చేస్తూ వీడియో కాల్ కారణంగా అడ్డంగా దొరికిపోతే.. అలాంటి ఘటనే పెరూలో జరిగింది. పెరూలో వీడియో కాల్ ఓ న్యాయవాది కొంప ముంచింది. హెక్టర్ సిప్రియానో పరేడ్స్ రోబెల్స్ అనే పెరూకు చెందిన న్యాయవాది 'వర్క్ ఫ్రం హోం'లో ఉన్నాడు. కరోనా కారణంగా అక్కడి కోర్టులు కేసు విచారణలను వర్చువల్‌గా నిర్వహిస్తున్నాయి. 
 
ఓ లోకల్ గ్యాంగ్‌కు సంబంధించిన కేసు విచారణ వర్చువల్‌గా న్యాయమూర్తి సమక్షంలో జరుగుతుండగా.. ఆ వర్చువల్ విచారణలో రోబెల్స్ పాల్గొన్నాడు. తాను జూమ్ కాల్‌లో ఉన్నానన్న సంగతి మరిచి..
 
కెమెరా ఆన్‌లో ఉందన్న స్పృహ కూడా లేకుండా ఓ మహిళతో రోబెల్స్ శృంగారంలో పాల్గొన్నాడు. జూమ్ కాల్‌లో విచారణ చేస్తున్న న్యాయమూర్తి ఆ అశ్లీల దృశ్యాలు చూసి బిత్తరపోయారు. వెంటనే విచారణ ప్రక్రియను నిలిపివేశారు. న్యాయమూర్తి వెంటనే రోబెల్స్ ఇంటికి ఓ పోలీసు అధికారిని పంపారు. శృంగార కార్యకలాపాలు కోర్టు విచారణలో కనిపిస్తున్నాయన్న విషయాన్ని రోబెల్స్‌కు తెలిసేలా చేశారు.
 
రోబెల్స్ బాగోతంపై విచారణ జరపాలని న్యాయమూర్తి ఆదేశించారు. రోబెల్స్ ఇకపై ఎలాంటి కేసులు వాదించడానికి వీల్లేదని స్పష్టం చేశారు. రోబెల్స్ ఓ కేసులో సాయం నిమిత్తం తన వద్దకు వచ్చిన మహిళతో శృంగారంలో పాల్గొన్నట్లు తేలడం కొసమెరుపు. రోబెల్స్ చేసిన ఈ నిర్వాకం వల్ల ఉద్యోగపరంగానూ, కుటుంబపరంగానూ సమస్యలు ఎదుర్కోవాల్సిన సంకటంలో పడ్డాడు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పెట్రో భారం ప్రజలపై ఉండదు... కేంద్రం శుభవార్త