Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

వెస్టిజ్‌‌తో వినికిడి- మాట్లాడటంలో సమస్యలు కలిగిన పారిశ్రామిక వేత్తలను శక్తివంతం

వెస్టిజ్‌‌తో వినికిడి- మాట్లాడటంలో సమస్యలు కలిగిన పారిశ్రామిక వేత్తలను శక్తివంతం
, మంగళవారం, 29 సెప్టెంబరు 2020 (16:21 IST)
భారతదేశంలో సుప్రసిద్ధ, దేశీయంగా వృద్ధి చెందిన డైరెక్ట్‌ సెల్లింగ్‌ కంపెనీ, వెస్టిజ్‌ ఇప్పుడు ఇ-శిక్షణా కార్యక్రమం వీ-ఎన్‌హాన్స్‌ను ఆవిష్కరించింది. ఈ ప్రత్యేక శిక్షణా కార్యక్రమం, వినికిడి మరియు మాట్లాడటంలో ఇబ్బంది ఉన్న పంపిణీదారులకు సహాయపడటంతో పాటుగా వెస్టిజ్‌ మార్కెటింగ్‌ యొక్క ఆరోగ్య, వెల్‌నెస్‌ ఉత్పత్తులు, వాటి ప్రయోజనాలను సంజ్ఞా భాషల ద్వారా అర్ధం చేసుకోగలుగుతారు.
 
పరిశ్రమలో మొట్టమొదటి కార్యక్రమంగా ప్రశంసలు పొందిన వీ-ఎన్‌హాన్స్‌ కార్యక్రమం, ప్రజలకు ఆర్ధిక స్వేచ్ఛను అందించాలనే కంపెనీ లక్ష్యాలకనుగుణంగా ఉంటుంది. కంపెనీ వ్యవస్థాపకులు, మేనేజింగ్‌ డైరెక్టర్‌ గౌతమ్‌ బాలీ మాట్లాడుతూ, ‘‘అంతర్జాతీయంగా విభిన్న వ్యక్తులకు సమానమైన అవకాశాలను వెస్టిజ్‌ అందిస్తుంది. వేలాది విజయగాథలు దీనినే వెల్లడిస్తున్నాయి. మా వరకూ, ప్రతి పంపిణీదారుడూ మాకు అత్యంత విలువైన భాగస్వామి. అందువల్ల, శారీరక వైకల్యం కలిగిన వ్యక్తులకు కూడా ఎదిగేందుకు సమాన అవకాశాలను అందించాలని భావించాము. ఆ నేపథ్యంతోనే వీ-ఎన్‌హాన్స్‌ను తీర్చిదిద్దాము’’ అని అన్నారు.
 
రెండు నెలల పాటు జరిగే శిక్షణా కార్యక్రమంలో వెస్టిజ్‌ అందించే పలు ఆరోగ్య, వెల్‌నెస్‌ ఉత్పత్తులను గురించి వెల్లడిస్తారు. ప్రతి వారం మహిళా ఆరోగ్యం, రోగ నిరోధక శక్తి, గ్లైసెమిక్‌ హెల్త్‌, ఫిట్‌నెస్‌, డైట్‌ వంటి ఎన్నో అంశాలపై శిక్షణా కార్యక్రమాలను నిర్వహిస్తారు.
 
వీ-ఎన్‌హాన్స్‌ శిక్షణా వీడియోలను తిలకించేందుకు ఎవరైనా సరే సంస్థ యొక్క అధికారిక యూ ట్యూబ్‌ ఛానల్‌ లేదా ఫేస్‌బుక్‌పై వెస్టిజ్‌ను చూడవచ్చు. మరిన్ని వివరాల కోసం మై వెస్టిజ్ వెబ్‌సైట్ చూడవచ్చు లేదా దగ్గరలోని పంపిణీదారుని సంప్రదించవచ్చు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్, నవంబరు 16 నుంచి మండల యాత్ర ప్రారంభం