Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పవన్ కళ్యాణ్‌కు కోపమొచ్చింది, ఆ ఒక్క ఎమ్మెల్యే మనకు అవసరమా?

Advertiesment
Pawan kalyan
, గురువారం, 19 నవంబరు 2020 (17:28 IST)
జనసేనాని పవన్ కళ్యాణ్ సినిమాల్లో కాస్త బిజీగా ఉండి మళ్ళీ తిరిగి రాజకీయాల్లోకి వచ్చేశారు. ఇదంతా తెలిసిందే. గత రెండురోజులుగా గుంటూరుజిల్లా మంగళగిరి వేదికగా కార్యకర్తలు, నాయకులతో సమావేశమయ్యారు. అమరావతి రైతుల సమస్యలను తెలుసుకున్నారు. పవన్ చాలా రోజుల తరువాత సమావేశం నిర్వహించడం కూడా ఆ పార్టీ నేతల్లో సంతోషాన్నిస్తోంది.
 
అయితే మరోవైపు జనసేన పార్టీ ఎన్నికలకు సిద్ధమవుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న ఎమ్మెల్యే కాస్త ఆ పార్టీకి దూరం అంటూ ప్రచారం జరుగుతోంది. ఆ ప్రచారం ఇప్పటిది కాదు. ఇది అందరికీ తెలిసిందే. రాజోలు నుంచి పోటీ చేసి గెలిచిన రాపాక వరప్రసాద్ ఆ పార్టీలో తప్ప అధికార పార్టీకి దగ్గరగా ఉండడం తెలిసిందే. 
 
అధికార పార్టీని పొగుడుతూ, ప్రభుత్వ పథకాలు బాగున్నాయని కితాబిస్తూ.. సిఎం శెభాష్ అంటూ ఇలా ఒకటేమిటి అసలు రాపాక జనసేన గుర్తుతో గెలిచారా.. లేకుంటే వైసిపి గుర్తుతో గెలిచారా అన్న అనుమానం కలిగే విధంగా ఆయన ప్రవర్తన ఉంది. దీంతో పవన్ కళ్యాణ్ ఆ ఎమ్మెల్యే మనకు అవసరమా? ఉన్న ఎమ్మెల్యే మనకు ఏ మాత్రం అందుబాటులో లేరు. అయినా మనం పట్టించుకోవడం లేదు.
 
నేను ఒక్కటే చెబుతున్నా. అందరం కలిసికట్టుగా ప్రజా సమస్యలపై పోరాడుదాం. ఉన్నవారు ఉండొచ్చు.. వెళ్ళే వారు వెళ్ళిపోవచ్చు. దేన్నీ పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు అంటూ పవన్ కళ్యాణ్ చాలా సీరియస్‌గా రాపాక వరప్రసాద్ గురించి మంగళగిరిలో జరిగిన కార్యకర్తల సమావేశంలో స్పష్టం చేశారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

జగన్‌ని చూసి ట్రంప్ నేర్చుకున్నాడు.. కనకరాజ్ వస్తే అన్నీ ఏకగ్రీవాలే : జేసీ దివాకర్