Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

చంద్రబాబు స్క్రిప్టు చదువుతున్న 'గోడ మీద పిల్లి' పవన్ కల్యాణ్: వైసీపీ

చంద్రబాబు స్క్రిప్టు చదువుతున్న 'గోడ మీద పిల్లి' పవన్ కల్యాణ్: వైసీపీ
, శనివారం, 14 సెప్టెంబరు 2019 (17:58 IST)
చంద్రబాబు స్క్రిప్టునే ఇంకా పవన్ కళ్యాణ్ చదువుతున్నాడు. పవన్ కళ్యాణ్ సొంతంగా ఎప్పుడు మాట్లాడడం నేర్చుకుంటాడో అర్ధం కాలేదు. జగన్మోహన్ రెడ్డి పారదర్శకంగా పాలన చేస్తుంటే చంద్రబాబు ఓర్వలేకపోతున్నారు అని వైసీపీ ఎమ్మెల్యే కిలారు రోశ‌య్య అన్నారు.

శ‌నివారం ఆయ‌న తాడేప‌ల్లిలోని పార్టీ కేంద్ర కార్యాల‌యంలో విలేక‌రుల స‌మావేశంలో మాట్లాడారు. "19 చారిత్రాత్మకమైన బిల్లులను సీఎం జగన్మోహన్ రెడ్డి  తీసుకువచ్చారు. అక్షరాస్యత పెంచాలని సీఎం జగన్మోహన్ రెడ్డి చూస్తున్నారు. ఇవేమీ పవన్ కళ్యాణ్ కు కనిపించడం లేదు.

19 చారిత్రత్మక బిల్లులుపై పవన్ కళ్యాణ్ అధ్యయనంలో చేయాలి. జనసేన పార్టీ టీడీపీ అనుబంధ పార్టీగా కొనసాగుతోంది. ప్రశ్నిస్తానన్న పవన్ కళ్యాణ్ ఎందుకు చంద్రబాబు అవినీతి ని ప్రశ్నించలేదు. 600లకు పైగా హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసిన చంద్రబాబు ఎందుకు ప్రశ్నించలేదు.

ఉద్దానం పవన్ కళ్యాణ్ వెళ్తే అన్ని అన్ని మౌళిక వసతులు కల్పిస్తామని చంద్రబాబు మాట తప్పితే జగన్మోహన్ రెడ్డి ఉద్దానంలో 200 పడకల ఆస్పత్రి కట్టిస్తున్నారు. వరదలు వలన ఇసుక పాలసీలో కొంత ఇబ్బంది ఏర్పడింది. ఇసుకలో వేల కోట్లు టీడీపీ నేతలు దోచుకుంటే ఎందుకు పవన్ కళ్యాణ్ మాట్లాడలేదు.

రూ.1.50 వేల కోట్లను చంద్రబాబు అప్పు చేసి దోచుకుంటే పవన్ కళ్యాణ్ ఎందుకు మాట్లాడలేదు.  ఆర్థిక పరిస్థితి బాగోలేకపోయినా  సీఎం జగన్మోహన్ రెడ్డి అనేక సంక్షేమ కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు. అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే జగన్మోహన్ రెడ్డి నాలుగున్నర లక్షల ఉద్యోగాలు సృష్టించారు.

చంద్రబాబు కు పవన్ కళ్యాణ్ రహస్య మిత్రుడుగా పని చేస్తున్నారు. చంద్రబాబు ఇచ్చిన స్క్రిప్ట్ నే పవన్ కళ్యాణ్ చదువుతున్నాడు. ఎందుకు పవన్ కళ్యాణ్ తన పార్టీని విస్తరించుకోలేకపోతున్నారు. జ‌గన్మోహన్ రెడ్డి సీఎం అయ్యాక వర్షాలు పడి నదులు నిండి రైతులు సంతోషంగా ఉన్నారు.

రైతులను నిర్లక్ష్యం చేసింది చంద్రబాబే. పవన్ కళ్యాణ్ ధైర్యం ఉంటే నిజాయితీగా నిజాలు మాట్లాడాలి. అమరావతిలో భూసేకరణ కు ఒప్పుకోనన్న పవన్ కళ్యాణ్ తరువాత మాట మార్చారు. రాజధాని మార్చుతామని సీఎం జగన్మోహన్ రెడ్డి, బొత్స సత్యనారాయణ చెప్పారా. ఉగాది రోజున 25 లక్షల మందికి ఇల్లు పట్టాలు ఇస్తామన్న సీఎం మాటలు పవన్ కళ్యాణ్ కు కనిపించడం లేదా?

ఛలో ఆత్మకూరు కార్యక్రమంలో చంద్రబాబు నవ్వుల పాలయ్యారు. జగన్మోహన్ రెడ్డి పై హత్యాయత్నం జరిగితే డీజీపీ స్టేట్ మెంట్ ఇచ్చిన విషయం పవన్ కళ్యాణ్‌కు కనిపించలేదా. సినిమాలో వలే చంద్రబాబు ఇచ్చిన స్క్రిప్ట్ ను పవన్ కళ్యాణ్ చదువుతున్నారు.

రాష్ట్ర ఆర్ధిక పరిస్థితికి చంద్రబాబు కారణం అనే విషయం పవన్ కు తెలియదా.  లింగమనేని ఇచ్చిన ఇళ్లలో చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఉంటూ జగన్మోహన్ రెడ్డి పై విమర్శలు చెస్తున్నారు. పవన్ కళ్యాణ్ కు చంద్రబాబు లింగమనేని కామన్ ఫ్రెండ్. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు పై పవన్ కళ్యాణ్ చర్చకు రావాలి. గోడ మీద పిల్లి వాటాన్ని పవన్ కళ్యాణ్ మానుకోవాలి.

కాపు రిజర్వేషన్లు విషయంలో కాపులను మోసం చేసింది చంద్రబాబు కాదా. కాపులను మోసం చేసిన చంద్రబాబు ను పవన్ కళ్యాణ్ ఎందుకు ప్రశ్నించలేదు. పవన్ కళ్యాణ్ ను అడ్డంపెట్టుకుని కాపులను మోసం చేయాలని చంద్రబాబు చూసారు. వివేకానంద రెడ్డి హత్య కేసుపై విచారణ జరుగుతుంది" అని వైసీపీ ఎమ్మెల్యే రోశ‌య్య అన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కారులో మంట‌లు చెల‌రేగి న‌లుగురు స‌జీవ‌ద‌హ‌నం... తిరుమలకు వెళ్లి వస్తూ...