Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

భారతిసిమెంట్స్ కు దోచిపెట్టడం కోసమే: కొమ్మారెడ్డి పట్టాభిరామ్

Advertiesment
Pattabhiram
, సోమవారం, 18 జనవరి 2021 (20:36 IST)
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దోపిడీకి సంబంధించి మరో కొత్త అధ్యాయం వెలుగులోకివచ్చిందని, ప్రజలను వివిధరకాల పన్నుల రూపంలో బాదుతూ, తనఖజానా నింపుకోవడం అనే ప్రక్రియను ఆయన యథేచ్ఛగా కొనసాగిస్తున్నాడని, టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ తెలిపారు. ఆయన మంగళగిరిలోని పార్టీ జాతీయకార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. 

ఆ వివరాలు ఆయన మాటల్లోనే  క్లుప్తంగా మీకోసం...!
జగన్మోహన్ రెడ్డి అవినీతి కంపెనీల్లో ఒకటైన భారతిసిమెంట్స్ ఆయన తండ్రి పదవిలోఉన్నప్పుడు పుట్టుకొచ్చింది. క్విడ్ ప్రోకోలో భాగంగా జగన్ అవినీతి చరిత్రలోంచి పుట్టుకొచ్చిన మురికి కంపెనీ భారతి సిమెంట్స్ సంస్థ.  ఆ కంపెనీనీ అడ్డంపెట్టుకొని వేలాదికోట్లను జగన్ దోచుకుంటున్నాడు.

భారతి సిమెంట్స్ కు దోచిపెట్టడం కోసం, సొంతకంపెనీకి మేలుచేయడం కోసం సిండికేట్లు ఏర్పాటుచేసి, సిమెంట్ ధరలు పెంచేసిన జగన్మోహన్ రెడ్డి, వందల, వేలకోట్లను ఆ కంపెనీకి దోచిపెడుతున్నాడు. ఒక పక్కన రాష్ట్రంలోఇసుకదోపిడీ, మరోపక్కన కనీసం రూ.350లు పెట్టినా నాణ్యమైన సిమెంట్ దొరికే పరిస్థితి లేదు. భవననిర్మాణ కార్మికులు రోడ్డునపడినా, కరోనా దెబ్బకు వారంతా ఉపాధికోల్పోయినా, నిర్మాణరంగం రాష్ట్రంలో కుదేలైనా అవేమీ పట్టించుకోకుండా, తనస్వార్ధంకోసం జగన్మోహన్ రెడ్డి సిమెంట్ ధరలు పెంచాడు. పేదవాడిపై కనీసకనికరం కూడా లేకుండా, వారు ఇల్లుకట్టుకునే అవకాశం లేకుండాచేసి, వారి సొంతింటికలను చిధ్రంచేశాడు. 

కరోనాకుముందు కృత్రిమ ఇసుక కొరత సృష్టించిన ముఖ్యమంత్రి, తన జేట్యాక్స్ కోసం సిమెంట్ కంపెనీలు ధరలుపెంచేలా చేశాడు. భారతి సిమెంట్స్ కుదోచిపెట్టడం కోసమే జగన్ సిమెంట్ వ్యవస్థను సిండికేట్ చేసి, ధరలు పెంచేలా చేశాడు. 

క్విడ్ ప్రోకో లో దోచుకున్న సొమ్ముతో పెట్టిన భారతి సిమెంట్స్ సంస్థ కుచెందిన 51శాతం వాటాను 2010లో వైక్యాట్ అనే ఫ్రెంచ్ కంపెనీకి అమ్మేశారు.  49శాతం వాటానుమాత్రం జగన్ తనకిందే ఉంచుకు న్నాడు. భారతి సిమెంట్స్ లో 51శాతం వాటాఉన్న వైక్యాట్ కంపెనీ వారు విడుదలచేసిన ఫైనాన్షియల్ రిపోర్ట్-2020లో చూస్తే, పేజ్ నెం-5లోచివరి పేరాగ్రాఫ్ లో,  ‘ధరలపెరుగుదల వల్ల రికార్డుస్థాయిలో లాభాలు వచ్చాయి’ అని రాశారు. 

రికార్డు స్థాయిలో లాభాలు ఆర్జించడంకోసం పేదవాడి నడ్డి విరవడం అనేది జగన్మోహన్ రెడ్డికే  సాధ్యమైంది. వైక్యాట్ కంపెనీ ఫైనాన్షియల్ రిపోర్టులో రాసిన మాటలను జగన్ కాదనగలడా? ధరలుపెంచి పేదవాడిని నాశనంచేసి, సిగ్గులేకుండా లాభాలు వచ్చాయని చెప్పుకుంటారా? లాభాలంటే మామూలు లాభాలుకాదు, ఈరోజు భారతి సిమెంట్స్ ఉత్పాధన సామర్థ్యం సంవత్సరానికి 5మిలియన్ టన్నులు. అంటే దాదాపు పదికోట్ల సిమెంట్ బస్తాలు.

బస్తాకి కనీసంగా రూ.100వరకు ధరపెంచితే, జగన్ రెడ్డికి రూ.వెయ్యికోట్ల వరకు లాభం వస్తుంది. ఉత్పత్తి అయ్యే సగంబస్తాలపై ధరపెంచినా రూ.500కోట్లవరకు లాభం వస్తుంది. ఇంతభారీమొత్తంలో దోపిడీకి సిద్ధపడే, నేడు జగన్ రెడ్డి సిమెంట్ ధరలపెంపునకు శ్రీకారం చుట్టా డు.  

చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నసమయంలో 2016 లో సిమెంట్ ధరలు పెరుగుతుంటే,  ఆయన సిమెంట్ కంపెనీలను హెచ్చరించారు. యనమల రామకృష్ణుడు నేత్రత్వంలో కేబినెట్ సబ్ కమిటీ నియమించి, సిమెంట్ ధరలు పెంచకుండా తయారీ కంపెనీ లను కట్టడిచేయడం జరిగింది. సిమెంట్ ధరలు తగ్గించి, రాష్ట్రంలో నిర్మాణ రంగం ఊపందుకునేలాచేసి, భవననిర్మాణ రంగ కార్మికుల ను, పేదలను ఆదుకున్నారు. 

చంద్రబాబునాయుడు చేసిన విధంగా జగన్  ఎందుకు చేయలేక పోతున్నాడు. జే-ట్యాక్స్ రూపంలో కంపెనీల నుంచి మామూళ్లు వసూలుచేస్తున్న వ్యక్తికి సిమెంట్ ధరలు తగ్గించే ధైర్యం, సత్తా ఎక్కడినుంచి వస్తాయి? భారతి సిమెంట్స్ కు లాభాలు రావడం కోసం సిమెంట్ ధరలు తగ్గించేప్రయత్నాన్ని ముఖ్యమంత్రి చేయడం లేదు. ఆయన మాత్రం లాభాలు గడిస్తూ, తన బినామీల కంపెనీలు బాగుపడాలి.

మంత్రిపెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి  లాంటి వాళ్లకు చెందిన కంపెనీలకు మాత్రం తక్కువధరకు సిమెంట్ అందా లి. బహిరంగ మార్కెట్లో మాత్రం సిమెంట్ బ్యాగ్ ధర రూ.350 నుంచి రూ.400వరకు అమ్మాలి. సామాన్యడు ఎన్నికష్టాలు పడినా, పేదలు ఇళ్లుకట్టుకున్నా కట్టుకోకపోయినా అవేవీ జగన్ కు పట్టవు. ఈ వ్యవహరంలో ముఖ్యమంత్రికి సహకరించడానికి ఆయన క్విడ్ ప్రోకో వ్యవహారానికి చెందిన వ్యక్తే పార్టనర్ గా ఉన్నా డు. అతనే ఇండియా సిమెంట్స్ అధినేత ఎన్. శ్రీనివాసన్. ఈడీ నమోదుచేసిన అనేక కేసుల్లో శ్రీనివాసన్ ముద్దాయి కూడా.

ఇండియా సిమెంట్స్ కిందే రాశి, కోరమండల్ అనే సంస్థలు కూడా ఉన్నాయి. గతంలో కూడా శ్రీనివాసన్ సిమెంట్ ధరలు పెంచేసి, దోచుకోవాలని చూస్తే, బిల్డర్స్ అందరూ కలిసి కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియావారికి ఫిర్యాదుచేయడం జరిగింది. ఆరోజున శ్రీనివాసన్ కు రూ.187కోట్లవరకు జరిమానా విధించడం జరిగింది. గతంలో రూ.187కోట్లజరిమానా కట్టిన పెద్దమనుషులతోకలిసి, జగన్ సిమెంట్ కంపెనీలన్నింటినీ ఏకంచేసి, సిమెంట్ ధరలు పెంచే శాడు.

తన అవినీతి సొమ్ముకోసం, కళ్లుమూసుకొని, సామాన్యుడి  ని ఇబ్బందిపెడుతున్న జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి ప్యాలెస్ లో సం బరాలుచేసుకుంటున్నాడు. జగన్ కు దమ్ము, ధైర్యంఉంటే, పెరుగు తున్న సిమెంట్ ధరలపై, చంద్రబాబునాయుడి మాదిరే కేబినెట్ సబ్ కమిటీ వేయాలి. సిమెంట్ కంపెనీల యజమానులను తాడేపల్లి ప్యాలెస్ కు పిలిపించి వారిని హెచ్చరించాలి. రేపటినుంచి ఆంధ్రప్రదేశ్ లో సిమెంట్ ధరలు తగ్గాలని వారిని హెచ్చరించే దమ్ము జగన్ కు ఉందా? తన భారతి సిమెంట్స్ ధరలు తగ్గించే ధైర్యం ఆయనకు ఉందా?

ముఖ్యమంత్రి ముందు ఆపనిచేస్తే, తరువాత ఆయన సంగతేంటో చూస్తాం. సిమెంట్ ధరలు ఎలా తగ్గించారో, కంపెనీలను ఎలా దారికి తేవాలో చంద్రబాబునాయుడు చేసి చూపించాడు. జగన్ కు అంత ధైర్యం లేదు కాబట్టే, తన అవినీతి మురికిలోనుంచి పుట్టిన భారతిసిమెంట్స్ కు లాభాలు చేకూర్చడం కోసం కొన్నికోట్లమందిని ఇబ్బందులకు గురిచేస్తున్నాడు. ప్రజలు ఇప్పటికైనా జగన్ సాగిస్తున్న సిమెంట్ మాఫియా గురించి ఆలో చించాలి.

వైక్యాట్ కంపెనీవారు రికార్డుస్థాయిలో లాభాలు వచ్చాయని చెబుతుంటే, వారి ప్రకటన కాదనే దమ్ము వైసీపీనేతలకు ఉందా అని నేను ప్రశ్నిస్తున్నాను. ముఖ్యమంత్రి పైకి కల్లబొల్లి మాటలు చెబుతూ, రూపాయి పేదలకు ఇస్తూ, పదిరూపాయలను వారి నుంచి దోచుకుంటున్నాడు. ఇవన్నీ ప్రజలు అర్థంచేసుకొని, ముఖ్యమంత్రిని తరిమితరిమికొట్టడం ఖాయమని స్పష్టంచేస్తున్నా. 

భారతిసిమెంట్స్ సహా అన్ని సిమెంట్ కంపెనీలతో ముఖ్యమంత్రి తక్షణమే చర్చలుజరిపి, సిమెంట్ ధరలు తగ్గేలాచేయాలని, నిర్మాణ రంగాన్నిఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నాను.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

టీకా పంపిణీ విజ‌యవంతం కావటం శుభపరిణామం: ఏపి గవర్నర్ బిశ్వ‌భూష‌ణ్ హ‌‌రిచంద‌న్