Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఉపాధి అవకాశాలను కల్పించడంలో దేశంలోనే అగ్రస్థానంలో మన రాష్ట్రం : మంత్రి పెద్దిరెడ్డి

ఉపాధి అవకాశాలను కల్పించడంలో దేశంలోనే అగ్రస్థానంలో మన రాష్ట్రం : మంత్రి పెద్దిరెడ్డి
, మంగళవారం, 2 నవంబరు 2021 (19:42 IST)
పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి పథకాల అమలులో అధికారులు పటిష్టమైన ప్రణాళికతో లక్ష్యాలను సాధించాలని రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి, భూగర్భగనులు, గ్రామ సచివాలయాల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కోరారు. తాడేపల్లిలోని పిఆర్‌&ఆర్డీ కమిషనర్ కార్యాలయంలో ఉపాధి హామీ, జగనన్న పచ్చతోరణం, జగనన్న స్వచ్ఛసంకల్పం, వైయస్‌ఆర్ జలకళ, వైయస్‌ఆర్ పల్లెవెలుగు, జగనన్న శాశ్వత భూహక్కు- భూరక్ష పథకాలపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. 
 
ఉపాధి హామీ పథకం పనుల్లో దేశంలోనే అగ్రస్థానం
 కరోనా సంక్షోభ సమయంలోనూ పేదలకు ఉపాధి అవకాశాలను కల్పించడంలో దేశంలోనే మన రాష్ట్రం అగ్రస్థానంలో నిలిచిందని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. ఈ ఏడాది రాష్ట్రంలోని పేదలకు 21.67 కోట్ల పనిదినాలు కల్పించాలనే లక్ష్యంను 99.87శాతం సాధించామని తెలిపారు. దీనిలో ఇప్పటికే 21.64 కోట్ల పనిదినాలను కల్పించామని అన్నారు. 

ఉపాధి హామీ కూలీలకు వేతనాల కింద ఇప్పటి వరకు రూ.4791.84 కోట్ల రూపాయలను, మెటీరియల్ కాంపోనెంట్ కింద రూ.2612.46 కోట్లు ఖర్చు చేశామని అన్నారు. అలాగే ఈ ఏడాది నిర్ధేశిత లక్ష్యాన్ని అధిగమించి పేదలకు పనులు కల్పించాలని కోరారు. నరేగా పనుల్లో బిల్లుల చెల్లింపుల్లో జాప్యం లేకుండా చూడాలని సూచించారు. 
 
ఉద్యమంలా మొక్కల పెంపకం
జగనన్న పచ్చతోరణం కింద మొక్కల పెంపకంను ఉద్యమంలా చేపట్టాలని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కోరారు. ఈ ఏడాది నాటిన మొక్కల్లో దాదాపు 94 శాతంకు పైగా మొక్కలు బతికాయని అన్నారు. జగనన్న పచ్చతోరణం కింద ఈ ఏడాది 1.23 కోట్ల మొక్కలు నాటడం పూర్తిచేశామని, అవెన్యూ ప్లాంటేషన్ కింద 16,416 కిలోమీటర్ల పరిధిలో 65.67 లక్షల మొక్కలు నాటామని అన్నారు.

అలాగే రైతులకు ఉపయోగపడేలా 51,770 ఎకరాల్లో హార్టీకల్చర్ లో భాగంగా 52.96 లక్షల మొక్కలు నాటామని తెలిపారు. ఒక్క హార్టీకల్చర్ విభాగంలోనే నాటిన మొక్కల్లో 97శాతం సంరక్షణ పొందాయని తెలిపారు. వచ్చే ఏడాది మొత్తం అరవై లక్షలకు పైగా మొక్కలు నాటాలనే లక్ష్యంతో పనిచేయాలని సూచించారు. నాటిని మొక్కలను సంరక్షించడం, వాటిని నీటిని అదించేందుకు ముందుకు వచ్చే వారికి కూడా ఉపాధి హామీ కింద చెల్లింపులు చేస్తున్నామని, ట్రాక్టర్లు సమకూర్చుకుని, మొక్కలకు నీరు అందించే వారికి కూడా చేయూతను అందిస్తున్నామని అన్నారు. 
 
వైయస్‌ఆర్ జలకళ కింద గ్రౌండ్ వాటర్ సర్వే వేగంగా పూర్తి చేయాలి
చిన్న, సన్నకారు రైతులకు సాగునీటి కష్టాలను తీర్చేందుకు ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్ రూపకల్పన చేసిన వైయస్‌ఆర్ జలకళ పథకంను పూర్తిస్థాయిలో రైతులకు చేరువ చేయాలని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కోరారు.

వైయస్‌ఆర్ జలకళ కింద రైతుల నుంచి ఇప్పటి వరకు  1,94,120 దరఖాస్తులు వచ్చాయని, వాటిల్లో అర్హత వున్న 1,32,911 దరఖాస్తులకు క్షేత్రస్థాయిలో అనుమతులు ఇవ్వడం జరిగిందని అన్నారు. వీటిల్లో 36,912 దరఖాస్తులకు గ్రౌండ్ వాటర్ సర్వే పూర్తయ్యిందని, వచ్చే ఏడాది జనవరి నాటికి అర్హత వున్న అన్ని దరఖాస్తులకు గ్రౌండ్ లెవల్ వాటర్ సర్వేను పూర్తి చేయాలనే లక్ష్యంతో అధికారులు పనిచేయాలని కోరారు.
 
స్వచ్ఛసంకల్పంతో ఆరోగ్యవంతమై పలెల్లు
జగనన్న స్వచ్చసంకల్పం కింద ఆరోగ్యవంతమైన పల్లెలుగా తీర్చిదిద్దుకోవాలని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కోరారు. ఘన, ద్రవ వ్యర్థాల నిర్వహణ, పారిశుధ్యంపై ప్రజల భాగస్వామ్యాన్ని పెంచాలని అన్నారు. స్వచ్ఛ గ్రామాల రూపకల్పనపై ప్రజల ఆలోచనల్లో మార్పు తీసుకురావాలని కోరారు.

గతంలో పంచాయతీరాజ్‌ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన పరిశుభ్రత-పక్షోత్సవాలకు ప్రజల నుంచి మద్దతు లభించిందని, ఈ కార్యక్రమంలో ప్రజల నుంచి స్వచ్ఛందంగా విరాళాలు కూడా వచ్చాయని గుర్తు చేశారు. ఇప్పటికే గ్రామాల్లో స్వచ్ఛసంకల్పం కింద వంద రోజుల కార్యక్రమం నిర్వహిస్తున్నామని, ఇంటింటికి చెత్త సేకరణను నూరుశాతం సాధించాలని అధికారులకు సూచించారు.

ఇతర రాష్ట్రాల్లో తక్కువ వ్యయంతో నిర్వహిస్తున్న మురుగునీటి వ్యర్థాల నిర్వహణా ప్లాంట్‌లపై స్వచ్ఛంధ్ర అధికారుల బృందం పరిశీలిస్తోందని,  గ్రామాల్లో ప్లాంట్‌ల ఏర్పాటుపై ఇప్పటికే అధికారులు సర్వే చేస్తున్నారని అన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నాదెండ్ల మనోహర్‌తో జనసేనానికి గ్యాప్ పెరుగుతోందా?