Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఏపీలో 17 నుంచి 26 కోర్సుల్లో నిపుణులతో ఆన్ లైన్ శిక్షణ

ఏపీలో 17 నుంచి 26 కోర్సుల్లో నిపుణులతో ఆన్ లైన్ శిక్షణ
, బుధవారం, 12 ఆగస్టు 2020 (19:46 IST)
కోవిడ్-19 వైరస్ వ్యాప్తి నేపథ్యంలో విద్యార్థులు, నిరుద్యోగ యువతకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ (ఎపిఎస్‌ఎస్‌డిసి) ఆధ్వర్యంలో ఆన్ లైన్ ద్వారా నైపుణ్యశిక్షణ కార్యక్రమాలు అమలు చేస్తున్నట్టు ఆ సంస్థ చైర్మన్ చల్లా మధుసూదన్ రెడ్డి, ఎండి, సీఈవో డాక్టర్ అర్జా శ్రీకాంత్ తెలిపారు. 
 
ఇంజనీరింగ్, పాలిటెక్నిక్ పూర్తి చేసిన, చదువుతున్న వారికి ఈనెల 17 నుంచి 26 కోర్సుల్లో నిపుణులతో ఆన్ లైన్ శిక్షణ ఇస్తున్నట్టు వారు తెలిపారు. 
 
మెషీన్ లెర్నింగ్, డాటా అనాలసిస్, సైబర్ సెక్యూరిటీ, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐఒటి), ఎడ్యుఎస్ క్లౌడ్ కంప్యూటింగ్, ఆండ్రాయిడ్ అప్లికేషన్ డెవలప్మెంట్, ఎంబాడెడ్ సిస్టమ్స్, వెబ్ డెవలప్మెంట్, పైథాన్ ప్రోగ్రామింగ్, డ్రోన్స్ టెక్నాలజీ, ఇండస్ట్రియల్ ఆటోమేషన్, ఆర్కిటెక్చరల్ మోడలింగ్ యూజింగ్ రివిట్, కేటియా, ఇటాబ్స్, ఆటోక్యాడ్, సోలిడ్ ఎడ్జ్, స్టాడ్ ప్రొ, గేమింగ్, లైనెక్స్ మరియు షెల్ స్క్రిప్టింగ్, సోర్స్ కోడ్ మేనేజ్మెంట్ యూజింగ్ విత్ గిట్ & గిట్ హబ్, సైన్స్ ల్యాబ్ మరియు పిసిబి డిజైనింగ్ కోర్సుల్లో 15 నుంచి 60 గంటల పాటు ఆన్ లైన్లో ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్టు చల్లా మధుసూదన్ రెడ్డి, డాక్టర్ అర్జా శ్రీకాంత్ తెలిపారు. 
 
ముఖ్యంగా మార్కెట్ లో డిమాండ్ ఉన్న కోర్సుల్లో మన యువతకు శిక్షణ ఇవ్వడం ద్వారా ఉద్యోగ అవకాశాలు మరింత సులువుగా పొందే అవకాశం ఉంటుందన్నారు. 
 
శిక్షణను విజయవంతంగా పూర్తి చేసిన వారికి ఆన్ లైన్ ద్వారానే సర్టిఫికెట్ ప్రదానం చేస్తామన్నారు. ఆసక్తి ఉన్న ఇంజనీరింగ్, పాలిటెక్నిక్ చదువుతున్న, పూర్తయిన వారు www.apssdc.in (or) http://engineering.apssdc.in/  వెబ్ సైట్లో ఈనెల 15లోపు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఈనెల 17వ తేదీ నుంచి ఆన్ లైన్ క్లాసులు ప్రారంభం అవుతాయి. 
 
రిజిస్ట్రేషన్ కు సంబంధించి ఎలాంటి సందేహాలు ఉన్నా ఎపిఎస్‌ఎస్‌డిసి టోల్ ఫ్రీ నంబర్ 18004252422 కి కాల్ చేసి తెలుసుకోవచ్చు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

'వైఎస్సార్‌ చేయూత'ను ప్రారంభించిన జగన్‌