Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఆర్టీసీలో త్వరలోనే కారుణ్య నియామకాలను చేపడతాం: మంత్రి పేర్ని నాని

Advertiesment
ఆర్టీసీలో త్వరలోనే కారుణ్య నియామకాలను చేపడతాం: మంత్రి పేర్ని నాని
, బుధవారం, 12 ఆగస్టు 2020 (09:31 IST)
ఆర్టీసీలో పని చేస్తూ మృతి చెందిన ఉద్యోగుల కుటుంబ సభ్యుల్లో ఒకరికి కారుణ్య నియామకం కింద ఉద్యోగాలు ఇచ్చేందుకు ఇప్పటికే ఆర్టీసీ అంగీకరించిందని, వారి పట్ల పూర్తి సానుభూతితో ప్రభుత్వం ఉందని  త్వరలోనే కారుణ్య నియామకాలను చేపడతామని, రాష్ట్ర రవాణా, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పేర్ని నాని ప్రకటించారు. 

ఆయన మచిలీపట్నంలోని తన కార్యాలయం వద్దకు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల సమస్యలను ఓపిగ్గా విని పలు పరిష్కారాలు వారికి చూపించారు. తొలుత  రాష్ట్రంలోని అనంతపూర్, కర్నూల్,  తూర్పు గోదావరి,  కర్నూల్, కడప, గుంటూరు జిల్లాలకు చెందిన ఆర్టీసీ కారుణ్య నియామక అభ్యర్థులు మంత్రిని కలిసి తమ కష్టాలను ఏకరువు పెట్టారు.

తమ తండ్రులు, భర్తలు ఆర్టీసీలో పని చేస్తూ విధి నిర్వహణలో అకాల మృత్యువు పాలయ్యారని, గత కొంతకాలంగా కారుణ్య నియామకాలు లేకపోవటంతో తాము ఎంతో ఇబ్బందులకు గురవుతున్నట్టు ఆవేదన వ్యక్తం చేశారు.

మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ.. తనకు కారుణ్య నియామకాల పట్ల పూర్తి చిత్తశుద్ధి ఉందని, మీపట్ల ఎంతో సానుభూతితో ఉన్నానని, తప్పక మీకు సహాయపడతానని వారికి తెలిపారు.

వచ్చిన వారందరికీ అల్పాహారం ఏర్పాటుచేసి తిరుగు ప్రయాణం ఖర్చుల నిమిత్తం ఒక్కొక్కరికి  500 రూపాయల చొప్పున నగదు అందచేయాలని తన వ్యక్తిగత కార్యదర్శి తేజకు మంత్రి పేర్ని నాని ఆదేశించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కోవిడ్ వ్యాక్సిన్ రష్యాను కోరిన భారత్... పరిశీలిస్తున్నామంటూ వెల్లడి