ఎంసెట్ కౌన్సిలింగ్‌లో ఆన్లైన్ ఇబ్బందులు పరిష్కరించండి: మంత్రి గంటా
అమరావతి : ఎంసెట్ కౌన్సిలింగ్‌లో కొంతమంది విద్యార్థులకు సంక్షిప్త సందేశాలు అందడం లేదంటూ ప్రసార మాధ్యమాల్లో వచ్చిన వార్తలపై మంత్రి గంటా శ్రీనివాసరావు అధికారులను వివరణ అడిగారు. అమెరికా పర్య
అమరావతి : ఎంసెట్ కౌన్సిలింగ్‌లో కొంతమంది విద్యార్థులకు సంక్షిప్త సందేశాలు అందడం లేదంటూ ప్రసార మాధ్యమాల్లో వచ్చిన వార్తలపై మంత్రి గంటా శ్రీనివాసరావు అధికారులను వివరణ అడిగారు. అమెరికా పర్యటనలో వున్నప్పటికీ ఎంసెట్ కౌన్సిలింగ్ పైన దృష్టి సారించిన మంత్రి గంటా.. ఆన్లైన్‌లో విద్యార్థులకు ఎందుకు ఇబ్బందులు వస్తున్నాయంటూ అధికారులను ప్రశ్నించారు.
మంగళవారం సాయంత్రం ఈ అంశంపై ఎంసెట్ కన్వీనర్ పాండాదాస్‌తో మాట్లాడారు. తొలిసారి ఆన్లైన్ పద్ధతిలో సర్టిఫికేట్లను వెరిఫై చేస్తున్నామని, దీంతో కొంతమేర అది కూడా వైజాగ్ కౌన్సిలింగ్ సెంటర్‌లో కొంత ఇబ్బంది ఏర్పడిందని, మిగతా అంతా సవ్యంగా జరుగుతోందని వారు మంత్రికి వివరించారు. వైజాగ్ సెంటర్ కౌన్సిలింగ్ అధికారిని మార్చి.. కొత్తగా మరో అధికారిని నియమించామన్నారు.
ఇప్పటికే 14 హెల్ప్ లైన్ సెంటర్లు వుండగా... మరో 4 నాలుగు హెల్ప్ లైన్ సెంటర్లు వైజాగ్, తిరుపతి, నెల్లూరు, కడపలో ఏర్పాటు చేశామన్నారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది రాకుండా చర్యలు తీసుకోవాలని, ఎంసెట్ కౌన్సిలింగ్ సజావుగా నిర్వహించాలని మంత్రి గంటా అధికారులను ఆదేశించారు.
అనంతపురంలో ఏర్పాటు చేయనున్న సెంట్రల్ వర్శటీకి మెంటర్‌గా హైదరాబాద్ సెంట్రల్ వర్శటీని నియమించారని మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. రేపటి నుంచి హెచ్‌సీయూ అధికారులు అనంతపురంలో సరైన క్యాంపస్, భవనాలను ఎంపిక చేసేందుకు ఎస్కేయూ, జెఎన్టియూను పరిశీలించనున్నారని, దీనికి సంబంధించి తగిన ఏర్పాట్లు చేయాలని మంత్రి గంటా శ్రీనివాసరావు ఉన్నత విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. ఈ అంశంపై పలు సూచనలను చేశారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి తరగతులను నిర్వహించేలా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులకు స్పష్టం చేశారు.