Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 3 ముక్కలవుతుంది... డౌట్ లేదు... పవన్ కళ్యాణ్

జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇవాళ ఉత్తరాంధ్ర మేధావులతో మాటామంతీ సాగించారు. ఏపీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల వల్ల రాబోయే కాలంలో ఏపీ 3 ముక్కలయినా ఆశ్చర్యపోనక్కర్లేదని ఆందోళన వ్యక్తం చేశారు. అభివృద్ధి అంతా అమరావతి చుట్టూనే చేస్తున్నారనీ, దా

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 3 ముక్కలవుతుంది... డౌట్ లేదు... పవన్ కళ్యాణ్
, మంగళవారం, 29 మే 2018 (21:02 IST)
జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇవాళ ఉత్తరాంధ్ర మేధావులతో మాటామంతీ సాగించారు. ఏపీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల వల్ల రాబోయే కాలంలో  ఏపీ 3 ముక్కలయినా ఆశ్చర్యపోనక్కర్లేదని ఆందోళన వ్యక్తం చేశారు. అభివృద్ధి అంతా అమరావతి చుట్టూనే చేస్తున్నారనీ, దాంతో అటు రాయలసీమ, ఇటు ఉత్తరాంధ్ర అభివృద్ధికి ఆమడదూరంలో వుంటున్నాయని అన్నారు. ఆయన మాటల్లో...
 
"అమరావతి రాజధానికని రైతుల నుంచి లక్ష ఎకరాలు సేకరించారు. శ్రీకాకుళం నుంచి వచ్చిన సామాన్యుడు ఎక్కడ వుండాలి? వారికి కనీసం వుండేందుకు ఇల్లు దొరుకుతుందా? కొనాలంటే భూముల ధరలు అందుబాటులో వుంటాయా? ఇలాంటివన్నీ ఎంతోకొంత మాట్లాడుదామని రాజకీయాల్లోకి వచ్చాను.
 
ఉత్తరాంధ్ర వెళితే అక్కడవారు ఉపాధి కోసం వలసలకు వెళుతున్నారు. పొట్ట కూటి కోసం హైదరాబాదుకు వెళ్లినవారు ఇప్పుడు ఆంధ్రోళ్లు అయిపోయారు. ఇక్కడ ఉపాధి అవకాశాలను ప్రభుత్వం కల్పించదా? ఉత్తరాంధ్రను డంప్ యార్డ్ చేస్తున్నారు. ఎలాంటి కాలుష్యపరమైన పరిశ్రమ వచ్చినా ఉత్తరాంధ్రకు తరలిస్తున్నారు. ఏం అమరావతిలో పెట్టుకోవచ్చు కదా, గుజరాత్ రాష్ట్రంలో పెట్టవచ్చు కదా. మానవత్వాన్ని చిధ్రం చేసేస్తున్నారు.
 
ఇవన్నీ చూసి మనస్సాక్షి నుంచి తప్పించుకోలేక రాజకీయాల్లోకి వచ్చి తిట్లు తింటున్నాను. ఐనా ఏం ఫర్వాలేదు. అన్నీ భరిస్తాను. సామాన్యులు అన్యాయానికి గురవుతుంటే చూస్తూ మాత్రం కూర్చోను. అందుకే రాజకీయాల్లోకి వచ్చాను. నా పని నేను ఖచ్చితంగా చేసి తీరుతా" అంటూ చెప్పుకొచ్చారు పవన్ కళ్యాణ్.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వైసిపిలోకి క్యూ కడుతున్న తెలుగుసినీ ప్రముఖులు.. ఎందుకంటే?