Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

జేసీ దివాకర్ రెడ్డి అలకపాన్పు.. అవిశ్వాసంపై ఓటింగ్‌కు దూరం

తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, అనంతపురం ఎంపీ జేసీ దివాకర్‌ రెడ్డి అలకపాన్పునెక్కారు. ఇది టీడీపీలో కలకలం రేపుతోంది. ప్రధాని నరేంద్ర మోడీ సర్కారుపై తెలుగుదేశం పార్టీ అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టింద

Advertiesment
జేసీ దివాకర్ రెడ్డి అలకపాన్పు.. అవిశ్వాసంపై ఓటింగ్‌కు దూరం
, గురువారం, 19 జులై 2018 (11:48 IST)
తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, అనంతపురం ఎంపీ జేసీ దివాకర్‌ రెడ్డి అలకపాన్పునెక్కారు. ఇది టీడీపీలో కలకలం రేపుతోంది. ప్రధాని నరేంద్ర మోడీ సర్కారుపై తెలుగుదేశం పార్టీ అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. దీనికి కాంగ్రెస్ పార్టీకూడా మద్దతు ప్రకటించింది. ఈ నేపథ్యంలో జేసీ దివాకర్ రెడ్డి అలకపాన్పునెక్కడం ఇపుడు చర్చనీయాంశంగా మారింది.
 
ఇదే అంశంపై ఆయన బుధవారం రాత్రి అనంతపురంలోని తన నివాసంలో మీడియాతో మాట్లాడుతూ, పార్టీలో కొందరు నేతల వైఖరికి నిరసనగా తాను అవిశ్వాస తీర్మానం ఓటింగ్‌లో పాల్గొనబోనని ఆయన తేల్చి చెప్పారు. 'కేంద్రంపై టీడీపీ ప్రవేశపట్టిన అవిశ్వాస తీర్మానంపై చర్చకు నేను హాజరు కావడం లేదు. దీనికి రాజకీయ కారణాలున్నాయి. అటు కేంద్రంలోనూ, ఇటు రాష్ట్రంలోనూ రాజకీయ వాతావరణం బాగా లేదు. నేను పార్లమెంట్ సమావేశాలకు వెళ్లడం లేదనే విషయం సీఎంకు కూడా తెలుసనుకుంటున్నాను. 
 
కాగా, అవిశ్వాస తీర్మానానికి హాజరైనా కాకపోయినా జరిగే పెద్ద నష్టమేమీ లేదు. మోడీని ప్రధాని పదవి నుంచి దించలేమన్న విషయం అందరికీ తెలుసు. కాకపోతే రాష్ట్రానికి కేంద్రం చేసిన అన్యాయాన్ని దేశ ప్రజలందరికీ తెలియజేసేందుకే ఈ ప్రయత్నం చేస్తున్నాం. ఈ అంశాన్ని టీడీపీ ఎంపీలు చక్కగా వివరించగలరు. నేను అసలు అలగలేదు. అలిగితే బుజ్జగించాలనీ నాకు లేదు' అని జేసీ చెప్పుకొచ్చారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సోదరుడి హత్యకు ప్రతీకారం.. పప్పులో విషం కలిపిన బాలిక.. చివరికి?