Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నంద్యాల ఉప ఎన్నికల్లో సైకిల్ దూకుడు.. టీడీపీ అభ్యర్థి ఘన విజయం

కర్నూలు జిల్లా ఉప ఎన్నికల్లో సైకిల్ దూకుడుకు ఫ్యాన్ కొట్టుకునిపోయింది. ఫలితంగా ఈ ఎన్నికలో అధికార టీడీపీ అభ్యర్థి భూమా బ్రహ్మానంద రెడ్డి 27456 ఓట్ల మెజార్టీతో ఘన విజయం సాధించారు. నిజానికి సోమవారం ఉదయం

Advertiesment
Nandyal by-election
, సోమవారం, 28 ఆగస్టు 2017 (13:39 IST)
కర్నూలు జిల్లా ఉప ఎన్నికల్లో సైకిల్ దూకుడుకు ఫ్యాన్ కొట్టుకునిపోయింది. ఫలితంగా ఈ ఎన్నికలో అధికార టీడీపీ అభ్యర్థి భూమా బ్రహ్మానంద రెడ్డి 27456 ఓట్ల మెజార్టీతో ఘన విజయం సాధించారు. నిజానికి సోమవారం ఉదయం నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభంకాగా, తొలి రౌండ్ నుంచే టీడీపీ అభ్యర్థి ఆధిక్యాన్ని కనబరుస్తూ వచ్చారు. ఫలితంగా మరో రెండు రౌండ్ల ఓట్ల లెక్కింపు మిగిలివుండగానే టీడీపీ అభ్యర్థి విజయం సాధించారు. 
 
నంద్యాల రూరల్ మండలంలో టీడీపీ పూర్తి ఆధిక్యాన్ని కనపరచగా, నంద్యాల అర్బన్‌లో మాత్రం ఇరు పార్టీల మధ్య హోరాహోరీగా పోటీ జరిగింది. అలాగే, వైకాపాకు మంచిపట్టున్నట్టు భావిస్తున్న గోస్పాడు మండలంలో కూడా టీడీపీ అభ్యర్థి ఆధిక్యాన్ని కనపరిచాడు. ఫలితంగా ఈ ఉప ఎన్నికలో టీడీపీ ఘన విజయం సాధించింది. 
 
ఇదిలావుండగా, టీడీపీ విజయం సాధించడంతో ఆ పార్టీ నేతలు, నాయకులు, కార్యకర్తలు సంబరాల్లో మునిగిపోయారు. ఈ ఉపఎన్నికల్లో విజయం సాధించిన భూమ బ్రహ్మానంద రెడ్డికి ఇప్పటికే పలువరు అభినందనలు తెలుపుతున్నారు. 
 
అమరావతిలోని ముఖ్యమంత్రి నివాసం వద్ద కూడా టీడీపీ శ్రేణులు సంబరాలు జరుపుకున్నారు. ముఖ్యంగా, తనను అభినందించేందుకు వచ్చిన పార్టీ సీనియర్ నేతలు, మంత్రులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా స్వీట్లు తినిపించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

2020 అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయనున్న ఫేస్‌బుక్ చీఫ్ జుకర్ బర్గ్?