Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అసాంఘిక శక్తులకు రారాజు చంద్రబాబు... ఢిల్లీకి ఎందుకొచ్చారు?

Advertiesment
అసాంఘిక శక్తులకు రారాజు చంద్రబాబు... ఢిల్లీకి ఎందుకొచ్చారు?
విజ‌య‌వాడ‌ , బుధవారం, 27 అక్టోబరు 2021 (15:27 IST)
ఏం ప్రయోజనం కోసం చంద్రబాబు ఢిల్లీ వచ్చారు? ‘‘పట్టాభి అసభ్య పదజాలాన్ని చంద్రబాబు సమర్థిస్తున్నారా? చంద్రబాబు నాయుడే ఒక టెర్రరిస్ట్ అని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మండిప‌డ్డారు. పట్టాభి తిట్లను సమర్థించుకోవడానికే చంద్రబాబు ఢిల్లీ వచ్చారా? అని వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ప్రశ్నించారు. 
 
బుధవారం ఆయన ఢిల్లీలో జాతీయ మీడియాతో మాట్లాడుతూ, అసాంఘిక శక్తులకు రారాజు చంద్రబాబు అంటూ మండిపడ్డారు. వ్యవస్థలను మేనేజ్ చేయడానికి ఢిల్లీ వచ్చారా.. ఏం ప్రయోజనం కోసం వచ్చారు? అంటూ దుయ్యబట్టారు. ఉద్దేశ్యపూర్వకంగానే పట్టాభితో తిట్టించారని నిప్పులు చెరిగారు. పట్టాభి వ్యాఖ్యలపై సహజంగానే ప్రజల్లో వ్యతిరేకత వ్యక్తమైందన్నారు. 
 
‘‘పట్టాభి అసభ్య పదజాలాన్ని చంద్రబాబు సమర్థిస్తున్నారా? చంద్రబాబు నాయుడే ఒక టెర్రరిస్ట్. గంజాయి వ్యాపారంలో లోకేష్ పాత్ర ఉందని ప్రజలందరికీ తెలుసు. ఆంధ్రరాష్ట్ర పరువును చంద్రబాబు దిగజారుస్తున్నారని విజయసాయిరెడ్డి ధ్వజమెత్తారు. టెర్రరిస్ట్ ముఠాకు చంద్రబాబు నాయకుడు. పోలీస్ వ్యవస్థను నిర్వీర్యం చేసేందుకు బాబు యత్నిస్తున్నాడు. చంద్రబాబు ఢిల్లీ ఎందుకు వచ్చారు?  అమిత్ షాపై రాళ్లు వేయించిన వీడియో చూపించావా? అని ఎద్దేవా చేశారు. 
 
తెలుగుదేశం మ‌హానాడులో ఆర్టికల్ 356 రద్దుపై తీర్మానం చేశారు. ఇప్పుడు అదే ఆర్టికల్ ఏపీలో ప్రయోగించాలంటున్నారు. డ్రగ్స్ వ్యాపారం చేసింది చంద్రబాబు, లోకేషే. చంద్రబాబు హయాంలో గంజాయి సాగుపై అప్పటి మంత్రి గంటా ఏం చెప్పారో ఆ వీడియో కూడా వినాలని విజయసాయిరెడ్డి అన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రూల్ ఆఫ్ లాకు వ్యతిరేకంగా జడ్జిమెంట్లు ఉన్నాయి: జస్టిస్ చలమేశ్వర్