Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నమ్మించి.. ఆపై వంచించి.. రేప్ ఘటన వెలుగులోకి ఇలా..

నెల్లూరు జిల్లా కనిగిరిలో ఓ బీఎస్సీ విద్యార్థినిపై ముగ్గురు విద్యార్థులు జరిపిన అత్యాచార యత్నం ఇపుడు రాష్ట్రాన్ని ఓ కుదుపుకుదిపింది. స్నేహం ముసుగులో ఓ విద్యార్థినిపై ఈ దారుణానికి పాల్పడ్డారు. ప్రతిఘటి

Advertiesment
Man Rape Attempt On Girl & Posts Video In Social Media
, బుధవారం, 27 సెప్టెంబరు 2017 (10:32 IST)
నెల్లూరు జిల్లా కనిగిరిలో ఓ బీఎస్సీ విద్యార్థినిపై ముగ్గురు విద్యార్థులు జరిపిన అత్యాచార యత్నం ఇపుడు రాష్ట్రాన్ని ఓ కుదుపుకుదిపింది. స్నేహం ముసుగులో ఓ విద్యార్థినిపై ఈ దారుణానికి పాల్పడ్డారు. ప్రతిఘటిస్తున్నా అసభ్యంగా ప్రవర్తిస్తూ ఆ దృశ్యాలను సెల్‌ఫోన్‌లో చిత్రీకరించి, సోషల్‌ మీడియాలో పోస్టు చేశారు. సభ్య సమాజం తలదించుకునే ఈ ఘటన ప్రకాశం జిల్లాలోని కనిగిరిలో ఆలస్యంగా వెలుగు చూసింది.
 
వాస్తవానికి ఈ ఘటన గత నెలలో జరిగింది. బాధితురాలి తల్లిదండ్రులకు ఈ విషయం తెలిసి కూడా పరువుతో కూడిన వ్యవహారం కావడంతో మౌనం దాల్చారు. ఇటీవల ఈ వీడియో దృశ్యాలు సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేయడంతో పట్టణంలో కలకలం రేగింది. ఈ మేరకు బాధిత విద్యార్థిని ఫిర్యాదు మేరకు సోమవారం రాత్రి పోలీసులు కేసు నమోదు చేశారు. 
 
విద్యార్థినిపై అత్యాచారానికి ప్రయత్నించిన కేసులో సాయి, కార్తీక్, పవన్‌లను అరెస్ట్‌ చేసినట్లు సీఐ మరవనేని సుబ్బారావు మంగళవారం వెల్లడించారు. సాయి ఏ1, కార్తీక్‌ను ఏ2, పవన్‌ను ఏ3 ముద్దాయిలుగా అరెస్ట్‌ చేసినట్లు పోలీసులు తెలిపారు. వీరిపై సెక్షన్‌ 366, 354, 354బీ, 60, 60ఏ, 34, 376, 307 సెక్షన్ల కింద అత్యాచారయత్నం, అసభ్యకర ప్రయత్నం, బట్టలు ఊడదీయడం, చంపేందుకు ప్రయత్నించడంతోపాటు ఐటీ యాక్ట్‌ తదితర కేసులు నమోదు చేసినట్లు సీఐ చెప్పారు. 

విద్యార్థినిపై చిత్రీకరించిన వీడియో దృశ్యాలు మంగళవారం మీడియాలో రావడాన్ని జిల్లా ఎస్పీ సత్య ఏసుబాబు సీరియస్‌గా తీసుకున్నారు. ఘటన తీరుపై కనిగిరి సీఐతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ముగ్గురు విద్యార్థుల నేర చరిత్ర.. కేసు నమోదు తదితర విషయాలపై అధికారులతో చర్చించినట్లు సమాచారం. 
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

జియో యూజర్లకు షాక్... రూ.4500లకు రీచార్జ్ చేస్తేనే రూ.1500 రీఫండ్