Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పెళ్లి చేసుకుని పడక సుఖం పొందాడు.. ఇపుడు వద్దుపో అంటున్నాడు...

హైదరాబాద్ నగరంలో మరో జూనియర్ ఆర్టిస్టు ఓ కామాంధుడి చేతిలో మోసపోయింది. మాయమాటలు చెప్పి పెళ్లి చేసుకున్నాడు. కొద్ది రోజులు కాపురం చేసి పడక సుఖం పొందాడు. ఇపుడు నీవు నాకొద్దుపో అని అంటున్నాడంటూ బాధితురాలు

Advertiesment
పెళ్లి చేసుకుని పడక సుఖం పొందాడు.. ఇపుడు వద్దుపో అంటున్నాడు...
, గురువారం, 13 సెప్టెంబరు 2018 (10:27 IST)
హైదరాబాద్ నగరంలో మరో జూనియర్ ఆర్టిస్టు ఓ కామాంధుడి చేతిలో మోసపోయింది. మాయమాటలు చెప్పి పెళ్లి చేసుకున్నాడు. కొద్ది రోజులు కాపురం చేసి పడక సుఖం పొందాడు. ఇపుడు నీవు నాకొద్దుపో అని అంటున్నాడంటూ బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ వివరాలను పరిశీలిస్తే...
 
వైజాగ్‌కు చెందిన జూనియర్‌ ఆర్టిస్ట్‌ (30) కృష్ణనగర్‌ బీ బ్లాక్‌లో నివసిస్తుంది. ఓ సినిమా షూటింగ్‌లో భాగంగా 2016లో విజయవాడకు చెందిన, పరిశ్రమలో ఆర్టిస్ట్‌గా పనిచేస్తున్న చైతన్యతో ఆమెకు పరిచయం ఏర్పడింది. సహజీవనం చేశారు. ఆ తర్వాత ఇంట్లోనే దేవుడి చిత్రపటం ముందు తాళి కట్టాడు. 
 
ఈ విషయాన్ని పెద్దలకు సైతం చెప్తానని యువతిని నమ్మించాడు. ఆ తర్వాత ఆమెతో కొద్ది రోజుల పాటు పడక సుఖం పొందాడు. ఈ నేపథ్యంలో గత నెల 13న ఇంటికొచ్చిన అతని బంధువులు బలవంతంగా చైతన్యను విజయవాడకు తీసుకెళ్లారు. చరవాణిలో అతనితో మాట్లాడేందుకు ప్రయత్నించినా నిరాకరించాడు. బుధవారం ఈ మేరకు బాధిత యువతి చైతన్యపై జూబ్లీహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది. చైతన్యపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కేరళ నన్‌తో బిషప్ బేరం.. రూ.5 కోట్లిస్తా.. రేప్ చేశానని చెప్పకు...