భీమిలి కేంద్రంగా ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ : విజయసాయి

ఆదివారం, 22 డిశెంబరు 2019 (13:55 IST)
విశాఖపట్టణం జిల్లాలోని భీమిలి కేంద్రంగా ఎగ్జిక్యూటివ్ (కార్యనిర్వాహక రాజధాని) క్యాపిటల్ ఏర్పాటవుతుందని వైకాపా ఎంపీ విజయసాయి రెడ్డి తెలిపారు. అలాగే, ఆంధ్రప్రదేశ్‌లో భవిష్యత్తులో 25 జిల్లాలు ఏర్పాటు చేయాలనే ఆలోచనలో ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డి ఉన్నారని ఆయన చెప్పుకొచ్చారు. 
 
శనివారం విశాఖ, భీమిలిలలో జరిగిన వివిధ కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 'ఉత్తరాంధ్ర వెనకబడిన ప్రాంతం. దాన్ని అభివృద్ధి చేయాలన్న సంకల్పంతోనే విశాఖలో రాజధానిని నెలకొల్పాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. భీమిలి మహాపట్టణంగా వెలుగొందనుంది' అని చెప్పారు. 
 
మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు చట్టానికి లోబడి శిక్ష పడుతుందని, కొన్ని శక్తుల వల్ల ఆయన తప్పించుకుంటున్నారని, భవిష్యత్తులో అలా జరగదన్నారు. రాజధానిని విశాఖకు తరలిస్తుంటే ఆయన అడ్డుపుల్లలు వేస్తున్నారని మండిపడ్డారు. అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి జరగాలన్నదే తమ అభిమతమని ఆయన చెప్పుకొచ్చారు. 

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం ప్రతి ముస్లిం ఇంటిపై జాతీయ జెండా ఎగరాలి : అసదుద్దీన్