వైకాపా నేతలకు టీడీపీ ఎమ్మెల్యే ఎమ్మెస్ రాజు మాస్ వార్నింగ్ ఇచ్చారు. తమ అభిమాన నటుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ జోలికి వస్తే చర్మం ఒలిచేస్తామంటూ హెచ్చరించారు. తాను ఒక బాలయ్య అభిమానిగా ఈ హెచ్చరిక చేస్తున్నట్టు ఆయన స్పష్టంచేశారు.
శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర అసెంబ్లీ స్థానం నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న ఎమ్మెస్ రాజు... హిందూపురంలో బాలకృష్ణపై కొందరు వైకాపా నేతలు చేసిన అనుచిత వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించారు.
హిందూపురంలో కొందరు చిల్లర వెధవలు బాలయ్య గురించి మాట్లాడారు. దీంతో ఆవేశానికి లోనైన మా కార్యకర్తలు వైకాపా కార్యాలయంపై దాడి చేశారు. ఇది మీకు, మీ అధినేతకు కూడా మా హెచ్చరిక అని ఆయన వ్యాఖ్యానించారు.
కాగా, హిందూపురంలోని వైకాపా కార్యాలయంతో పాటు పార్టీ ఇన్‌చార్జి దీపిక రెడ్డి భర్త కార్యాలయంపై కూడా టీడీపీ కార్యకర్తలు దాడి చేయడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది.