Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

రంపచోడవరం మన్యంలో భారీగా మద్యం

రంపచోడవరం మన్యంలో భారీగా మద్యం
, గురువారం, 2 జులై 2020 (23:53 IST)
తూర్పు గోదావరి జిల్లా రంపచోడవరం నియోజకవర్గం రంపచోడవరం ఏఎస్పీ బిందు మాధవ్ ఆదేశాల మేరకు మన్యం ప్రాంతాలలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాటు చేశారు. నిత్యం వాహనాల తనిఖీలను ముమ్మరం చేశారు.

కొంతమంది అక్రమ ధనర్జనే ధ్యేయంగా పెట్టుకొని నేరాలు చేస్తున్నారు. అక్రమ మద్యం రవాణాకు పూనుకొని పోలీసుల వలకు చిక్కుతున్నారు.

ఈ నేపథ్యంలో  తాజాగా గురువారం రంపచోడవరం డివిజన్ మారేడుమిల్లి గ్రామ శివారు ప్రాంతాల్లో మారేడుమిల్లి పోలీస్ ఎస్.ఐ. డి.రామకృష్ణ సిబ్బందితో కలసి వాహనాల తనిఖీలు చేస్తుండగా తెలంగాణ రాష్ట్రానికి చెందిన కాటవరం గ్రామం నుండి తూర్పు గోదావరి జిల్లా రావులపాలెం ప్రాంతానికి ఏపి05టిడి9776 నెంబర్ గల మహేంద్ర మ్యాక్షి సుప్రో ట్రక్ వాహనంలో అక్రమంగా తరలిస్తున్న 1820 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు.

వీటి విలువ సుమారు రూ.2,15,440 ఉంటుందని తెలిపారు. తూర్పు గోదావరి జిల్లా జొన్నాడ, ఆలమూరు ప్రాంతానికి చెందిన సిద్దిన చంద్రశేఖర్ (32) అదే ప్రాంతానికి చెందిన సుంకర నాగబాబు (32) నిందితులను అరెస్ట్ చేశారు.

దీనిపై మారేడుమిల్లి పోలీస్‌స్టేష‌న్‌ సీఐ ఏఎల్ఎస్ రవికుమార్ ఆధ్వర్యంలో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ డి.రామకృష్ణ తెలిపారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఫార్మా రంగంలో హైదరాబాద్ మరింత బలోపేతం:మంత్రి కే. తారకరామారావు