Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మద్యం సేవించి వాహనాలను నడపవద్దు: జగన్

మద్యం సేవించి వాహనాలను నడపవద్దు: జగన్
, గురువారం, 4 జూన్ 2020 (21:37 IST)
ఆటో, టాక్సి క్యాబ్‌ డ్రైవర్లు ప్రయాణీకులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చాలని, మద్యం సేవించి వాహనాలను నడపవద్దని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి కోరారు. క్యాంపు కార్యాలయంలో వాహనమిత్ర పథకంలో భాగంగా రెండో విడత ఆర్థికసాయం అందించే కార్యక్రమాన్ని గురువారం ఆయన ప్రారంభించారు.

మీట నొక్కడం ద్వారా 262 కోట్ల రూపాయల మొత్తాన్ని మీట నొక్కడం ద్వారా 2.62 లక్షల మంది బ్యాంకు ఖాతాల్లో ఆయన జమచేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఒక అన్నగా, తమ్ముడిగా ఈ సాయం చేస్తున్నట్లు తెలిపారు. గత ఏడాది ఆక్టోబర్‌లో ఈ పథకాన్ని ప్రారంభించామని. మళ్లీ అదే నెలలో ఆర్థికసాయం చేయాల్సిఉన్నప్పటికీ, కరోనా కరోనా కారణంగా ఇబ్బందులు పడుతున్నారని నాలుగు నెలల ముందే అమలు చేస్తున్నట్లు చెప్పారు.

వాహనమిత్ర పథకాన్ని ఎలాంటి అవకతవకలకు అవకాశం ఇవ్వకుండా పూర్తి పారదర్శకతతో అమలు చేస్తున్నట్లు తెలిపారు. అర్హులు ఎవరికైనా రాకపోతే గ్రామ సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు.

స్పందనలో రిజస్టర్‌ చేసుకున్నా ఇంటికి వచ్చి విచారణ చేసి వచ్చేనెల 4వ తేది నాటికి కొత్తవి ఇస్తామని తెలిపారు. వాహన యజమానులు ఈమొత్తాన్ని ఇన్సూరెన్స్‌, ఎఫ్‌సి కోసం ఖర్చు చేయాలని సూచించారు. పేదలకు న్యాయం చేస్తేనే రాష్ట్రానికి దేశానికి మంచిదని అన్నారు. ప్రతి వర్గానికి న్యాయం చేయాలని ఏడాదిముందే క్యాలెండర్‌ను రూపొందించుకుని ముందుకు పోతున్నామన్నారు.

ఈ నెలలో 10 వ తేదిన నాయీబ్రాహ్మణులకు, రజకులకు, టైలర్లకు సాయం అందిస్తామన్నారు. అలాగే 17న చేనేత కార్మికులకు, 24న కాపులకు కాపునేస్తం అందిస్తామన్నారు. ఎంయస్‌యంఇలకు రెండో విడత లబ్ధిని 29 వ తేదిన విడుదల చేస్తామన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

త్వరలో వైద్యశాఖలో 9,700 ఖాళీల భర్తీ: మంత్రి ఆళ్ల నాని