దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు వర్థంతి లేదు.. జయంతి లేదు. కానీ లక్ష్మీపార్వతి మాత్రం నేరుగా ఎన్టీఆర్ ఘాట్ వద్దకు వెళ్ళి నివాళులు అర్పించి నిరసన తెలిపారు. మీ గౌరవాన్ని, మీ పేరును చెడగొట్టేందుకు అల్లుడు చంద్రబాబునాయుడు కంకణం కట్టుకున్నాడంటూ ఒక పేజీ లెటర్ రాసి ఘాట్ వద్ద ఉంచింది లక్ష్మీపార్వతి. గంటపాటు మౌనంగా కూర్చుండి పోయింది. ఆ తరువాత చంద్రబాబుపై తీవ్రస్థాయిలో విమర్సలు చేశారు.
నైతిక విలువలు లేని వ్యక్తి చంద్రబాబు. ప్రజలను మోసగించడం.. నెరవేరని హామీలివ్వడం.. వెన్నుపోట్లు పొడవడం ఇలా ఒకటేమిటి. అన్నీ చంద్రబాబుకు బాగా తెలుసు. చనిపోయిన వ్యక్తి ఆత్మ క్షోభించేలా ప్రవర్తిస్తున్నారు చంద్రబాబు నాయుడు. ఎన్టీఆర్ బతికి ఉంటే కాంగ్రెస్ పార్టీతో కలిసినందుకు సంతోషపడేవారని బాబు చెప్పడం నాకు కోపాన్ని తెప్పిస్తోంది.
కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పెట్టిన పార్టీ తెలుగుదేశం. అలాంటి పార్టీని చంద్రబాబు ఏ విధంగా కాంగ్రెస్‌తో స్నేహం చేస్తారు. నా దృష్టిలో చంద్రబాబు నాయుడు అలా అయిపోయారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు లక్ష్మీపార్వతి.