Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

వ్యక్తి ప్రాణం తీసిన గుర్రపు స్వారీ... ఎక్కడ? (Video)

horse riding death

వరుణ్

, సోమవారం, 29 జులై 2024 (13:31 IST)
గుర్రవు స్వారీ ఓ వ్యక్తి ప్రాణాలు తీసింది. సరదాగా చేసిన గుర్రపు స్వారీ విషాదంగా ముగిసింది. గుర్రం నుంచి కిందపడటంతో తలకు బలంగా దెబ్బతగలడంతో ప్రాణాలు కోల్పోయాడు. కర్నూలు జిల్లాలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను పరిశీలిస్తే, మద్దికేరలో గుర్రపు స్వారీ చేస్తూ కిందపడిన పృథ్వీరాజ్ రాయుడు అనే యువకుడికి తీవ్రగాయాలు అయ్యాయి.. ఆ వెంటనే కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరించారు స్థానికులు.. కానీ, ఆస్పత్రిలో చికిత్స పొందుతూ పృథ్వీరాజ్ రాముడు ప్రాణాలు విడిచాడు..
 
కాగా, పూర్వీకుల నుండి వస్తున్న సంప్రదాయాన్ని కొనసాగించాలని ఉద్దేశంతో గుర్రపు స్వారీ నేర్చుకునేందుకు పృథ్వీరాజ్ రాముడు సిద్ధమయ్యాడు. కొత్తవారు ఎవరైనా సరే.. గుర్రం పరుగులు పెడుతుంటే.. బ్యాలెన్స్ చేయడం కష్టం.. అదే పరిస్థితి రాముడుకు ఎదరైంది.. గుర్రం ఎక్కి ప్రాక్టీస్ చేస్తుండగా.. అది పరుగులు తీసింది.. కొద్దిసేపు ముందుకు సాగిన అతడు.. ఆ తర్వాత గుర్రంపై నిలవలేకపోయాడు. 
 
బైకుపై గుర్రాన్ని వెంబడిస్తూ కొందరు యువకులు.. అదుపుచేసే ప్రయత్నం చేసినా గుర్రం పరుగులు ఆపలేదు. దీంతో అదుపుతప్పి గుర్రంపై నుంచి రోడ్డుపై పడిపోయాడు. తలకు తీవ్ర గాయం తగలడంతో ప్రాణాపాయస్థితిలోకి వెళ్లిన పృథ్వీరాజు రాయుడును స్థానికులు ఆసుపత్రికి తరలించారు. కానీ, అతడి ప్రాణాలు కాపాడలేకపోయారు. చికిత్స పొందుతూ ఆస్పత్రిలోనే మృతి చెందాడు. దీంతో ఆ కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతుంది. అయితే, మద్దికెరలో దసరా ఉత్సవాలలో గుర్రంపై ఊరేగడం యాదవరాజు వంశీయుల సంప్రదాయం. యాదవరాజుల వంశానికి చెందిన పృథ్వీరాజ్ మృతి చెందడంతో ఈ ఏడాది దసరా ఉత్సవాలలో గుర్రపు స్వారీ పందేలు జరుగుతాయా? లేదా? అనే అనుమానం నెలకొంది. 

 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పాక్‌ గిరిజన తెగల మధ్య ఘర్షణ : 36 మంది మృత్యువాత