Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

వీధి బాలలను గుర్తించి వారితో మాట్లాడిన కృష్ణా జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్

Advertiesment
Krishna district SP
, గురువారం, 20 మే 2021 (20:09 IST)
ఆపరేషన్ ముస్కాన్ రెండవ రోజులో భాగంగా ఈరోజు జిల్లా ఎస్పీ శ్రీ ఎం రవీంద్రనాథ్ బాబు ఐపిఎస్ గారు, పోలీసు అధికారులతో కలిసి వీధి బాలలను గుర్తించడానికి ప్రత్యక్షంగా కదం కదిపారు. అందులో ఆర్ పేట పోలీస్ స్టేషన్ పరిధిలోని మున్సిపల్ కార్యాలయానికి ఎదురుగా ఉన్న కూరగాయల మార్కెట్ నందు ముగ్గురు బాలురను గుర్తించి వారితో మాట్లాడారు.
 
ఆపరేషన్ ముస్కాన్ రెండవ రోజు కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఉదయం ఎస్పీగారే నేరుగా వీధి బాలలను గుర్తించేందుకు మచిలీపట్నంలోని మున్సిపల్ ఆఫీసు వద్ద ఉన్న కూరగాయాల మార్కెట్‌కి వెళ్లగా అక్కడ కొత్తిమీర అమ్ముతూ, గుమ్మడికాయల అమ్ముతూ, పేపర్ వేస్తూ ముగ్గురు బాలలు కనిపించారు
 
వారితో మాట్లాడుతూ ఏ విధంగా మిమ్మల్ని ఇంట్లో వారు పనికి పంపుతున్నారు అంటూ వీధి బాలలను ప్రశ్నించారు జిల్లా ఎస్పీ. కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నప్పటికీ ముక్కుపచ్చలారని చిన్నారులను ఈ విధంగా బయటకు పనులకు పంపుతున్నారని జిల్లా ఎస్పీ గారు అన్నారు.
 
మీకు తల్లిదండ్రులు ఉన్నారా లేకుంటే ఎవరి సంరక్షణలోనైనా ఉన్నారా, ఎందుకు మీ పట్ల మీ తల్లిదండ్రులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఇలా బయట వ్యాపారాలు చేసేందుకు పంపుతున్నారు. ఇటువంటి ధోరణి ప్రదర్శిస్తే వారిపై కేసులు నమోదు చేస్తామని తెలిపారు.
 
ముగ్గురు బాలురలో ఒకరికి తల్లిదండ్రులు లేకపోవడంతో వృద్ధులైన అమ్మమ్మ వాళ్ళ దగ్గర ఉండి ఇలా అమ్ముతుండడంతో , అతనితో మాట్లాడి, చదువుకుంటావా అడిగితే చదువు కుంటాను అనడంతో, ఎస్పీ గారు అక్కడ ఉన్న పోలీస్ అధికారులతో , స్వచ్ఛంద సేవా సంస్థల ద్వారా చదువుకునేందుకు ఏర్పాట్లు చేయాలని తెలిపారు.
 
ఈ కార్యక్రమంలో స్పెషల్ బ్రాంచ్ DSP ధర్మేంద్ర గారు, బందరు డిఎస్పీ రమేష్ రెడ్డి గారు, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ నాగేంద్ర కుమార్ గారు, ఆర్ పేట ఇన్స్పెక్టర్ భీమరాజు గారు, చిలకలపూడి ఇన్స్పెక్టర్ అంకబాబు గారు, RI విజయ సారథి గారు, సిబ్బంది పాల్గొన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఏపీలో బ్లాక్‌ ఫంగస్‌కు చికిత్స ఈ ఆస్పత్రులు ఇవే...