Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అమ్మతో సహజీవనం.. కూతురిపై అత్యాచారం...

Advertiesment
అమ్మతో సహజీవనం.. కూతురిపై అత్యాచారం...
, బుధవారం, 1 జనవరి 2020 (10:48 IST)
ఆడబిడ్డలపై అమానుషంగా వ్యవహరిస్తున్నారు. తాజాగా.. ఓ నీచుడు మహిళతో సహజీవనం చేస్తూనే, ఆమె కూతురిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ అమానవీయ ఘటన ఏపీలోని కృష్ణా జిల్లాలో చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. కంకిపాడు మండలం వణుకూరుకి చెందిన శివ గన్నవరం మండలం కేసరపల్లిలో ఉంటున్న మహిళతో సంబంధం పెట్టుకున్నాడు. గత కొంతకాలంగా ఆమెతో సహజీవనం చేస్తున్నాడు. 
 
అయితే.. ఆమెకు ఓ కూతురు(16) కూడా ఉంది. ఆమె కూతురిపై కన్నేసిన శివ ఎలాగైనా ఆమెను అనుభవించాలని అదను కోసం వేచి చూశాడు.
 
ఈ క్రమంలో ఈ నెల 16న బాలికకు కూల్‌డ్రింక్‌లో మత్తుమందు కలిపి ఇచ్చి, ఆమె మూర్ఛపోయాక అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఏపీలో దారుణం.. వివాహితపై గ్యాంగ్ రేప్