Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కిసాన్‌ రైలు: నూజివీడు నుండి న్యూఢిల్లీకి మామిడి పండ్లు రవాణా

కిసాన్‌ రైలు: నూజివీడు నుండి న్యూఢిల్లీకి మామిడి పండ్లు రవాణా
, సోమవారం, 17 మే 2021 (16:44 IST)
దక్షిణ మధ్య రైల్వే 200వ కిసాన్‌ రైలు 260 టన్ను మామిడి పండ్లతో ఆంధ్రప్రదేశ్‌లోని నూజివీడు నుండి ఢిల్లీలోని ఆదర్శనగర్‌కు బయలుదేరింది. దక్షిణ మధ్య రైల్వేలో కిసాన్‌ రైళ్లు విజయవంతంగా సాగుతున్నాయి. వీటి రవాణా ప్రారంభించిన నాటి నుండి మరిన్ని రైళ్ల కోసం నిరంతరంగా డిమాండ్‌ వస్తోంది. దీంతో తక్కువ రోజుల్లోనే 100వ కిసాన్‌ రైలును విజయవంతంగా నడిపి నూతన మైలురాయిని దాటింది.

దక్షిణ మధ్య రైల్వేలో మొదటి 100 కిసాన్‌ రైళ్ల రవాణాకు 187 రోజు పడితే, మరో 100 కిసాన్‌ రైళ్ల రవాణాకు 63 రోజు మాత్రమే పట్టింది. మొత్తంమీద, జోన్‌లోని వివిధ ప్రాంతాల నుండి కిసాన్‌ రైళ్ల ద్వారా మొత్తం 65,962 టన్నుల వ్యవసాయ ఉత్పత్తులు రవాణా అయ్యాయి. ఈ రైళ్లు జోన్‌లోని తెంగాణ, ఆంధ్రప్రదేశ్‌, మహారాష్ట్ర రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతా నుండి ప్రారంభ మయ్యాయి.

వీటిద్వారా పుచ్చకాయు, అరటిపండ్లు, టమోటా, ఉల్లిపాయలు, ద్రాక్ష, క్యారెట్‌, పసుపుకొమ్ము మరియు అరటి పండ్లు వంటి వివిధ సరుకు రవాణా చేయబడ్డాయి. అంతేకాక, ఈ రైళ్ల ద్వారా వ్యవసాయ సరుకును దేశంలోని అనేక ప్రాంతాకు రవాణా చేశారు. న్యూఢిల్లీ లోని ఆదర్శనగర్‌, న్యూ గౌహతి, మాల్దా టౌన్‌, అగర్తలా, ఫాతుహ, బరాసత్‌ మరియు న్యూ జాల్పాయిగురి వంటి ప్రాంతాలతో ఇతర ప్రాంతాలకు కూడా సరుకు రవాణా అయ్యాయి.
 
సరుకు రవాణాలో సురక్షిత, భద్రత, వేగవంతంగా రవాణాతో పాటు మార్గమధ్యలో సరుకు పాడైపోకుండా ఉంటూ  వ్యవసాయదారులకు మరియి వ్యాపారస్తులకు ప్రయోజనకరంగా ఉండేలా భారతీయ రైల్వే వారిచే కిసాన్‌ రైళ్లు ప్రారంభించబడ్డాయి. వీటికి అదనంగా ఫుడ్‌ ప్రాససింగ్‌ ఇండస్ట్రీస్‌ మంత్రిత్వ శాఖ వారి ‘ఆపరేషన్‌ గ్రీన్స్‌`టీఓపీ టోటల్‌’’ పథకం కింద 50% రాయితీ అందజేస్తుండడంతో వారికి ఆర్థిక ప్రయాజనం కూడా ఉంది. దీంతో కిసాన్‌ రైళ్ల ద్వారా రైతు, వ్యాపారస్తు వారి సరుకు రవాణాలో 50% రాయితీని పొందుతున్నారు.
 
ఈ అంశాల తోడ్పడడంతో పాటు వ్యవసాయదారులకు/వ్యాపారస్తులకు కిసాన్‌ రైళ్ల ద్వారా సరుకు రవాణా చేయడంతో వివిధ మార్కెట్లలో వారి ఉత్పత్తుకు మంచి గిరాకీ ఏర్పడడంతో వ్యవసాయ రంగానికి మరింత బం చేకూరింది. వినియోగదారుకు మరియు రైల్వే వారికి ఉభయులకు కిసాన్‌ రైళ్లు ప్రయోజకరంగా ఉన్నాయి. ప్రస్తుతం కోవిడ్‌ మహమ్మారి కొనసాగుతున్నా రైల్వే తగిన ముందు జాగ్రత్తు తీసుకుంటూ వ్యవసాయదారులకు మరియు వ్యాపారస్తులకు సహకరిస్తూ నిరంతరంగా కిసాన్‌ రైళ్లను కొనసాగిస్తుంది.
 
కిసాన్‌ రైళ్ల రవాణాలో నూతన మైలురాయిని అధిగమించడంలో కృషి చేసిన జోన్‌ మరియు డివిజన్ల అధికారులను, సిబ్బందిని దక్షిణ మధ్య రైల్వే జనరల్‌ మేనేజర్‌ శ్రీ గజానన్‌ ప్రత్యేకంగా అభినందించారు. వివిధ ప్రాంతా నుండి రైల్వే ద్వారా సరుకు రవాణా చేయడానికి ప్రోత్సాహించి వారి ఉత్పత్తులకు మంచి ధర వచ్చేలా కృషి చేసిన బృందం సభ్యును ఆయన అభినందించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

2-డీజీ ఫస్ట్‌ బ్యాచ్‌ను విడుదల చేసిన కేంద్రమంత్రి రాజ్‌నాథ్‌