Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

జగన్ బెయిల్ పిటిషన్ వాయిదా : సీబీఐకు కోర్టు సీరియస్ వార్నింగ్

జగన్ బెయిల్ పిటిషన్ వాయిదా : సీబీఐకు కోర్టు సీరియస్ వార్నింగ్
, సోమవారం, 17 మే 2021 (13:44 IST)
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి బెయిల్ పిటిషన్‌పై విచారణను మే 26వ తేదీకి వాయిదావేసింది. అదేసమయంలో సీబీఐకు కోర్టు సీరియస్ వార్నింగ్ ఇచ్చింది. ఈ కేసులో కౌంటర్ దాఖలు చేసేందుకు మరోమారు సమయం కోరడంతో కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇదే చివరి అవకాశం అంటూ హెచ్చరిక చేసింది. 
 
కాగా, పలు అవినీతి అక్రమాస్తుల కేసులో అరెస్టు అయిన సీఎం జగన్.. ప్రస్తుతం షరతుల బెయిల్‌పై ఉన్న విషయం తెల్సిందే. అయితే, ముఖ్యమంత్రి పదవిని అడ్డుపెట్టుకుని సాక్షులను ప్రభావితం చేస్తున్నారని, అందువల్ల జగన్ బెయిల్‌ను రద్దు చేయాలంటూ వైకాపాకే చెందిన నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. 
 
ఈ నెల 7వ తేదీన దీన్ని కోర్టు విచారణకు స్వీకరించింది. ఆ సమయంలో కౌంటర్ దాఖలు చేయడానికి కొంత సమయం కావాలంటూ కోరడంతో ఈ నెల 17వ తేదీకి వాయిదావేసింది. ఆ ప్రకారంగా సోమవారం విచారణకు రాగా, మళ్లీ సమయం కావాలంటూ సీబీఐ తరపు న్యాయవాది కోరడంతో ఆగ్రహించిన న్యాయమూర్తి.. ఇదే చివరి అవకాశం అంటూ హెచ్చరిస్తూ తదుపరి విచారణను ఈ నెల 26వ తేదీకి వాయిదా వేసింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

శ్రీకాళహస్తి 1000 పడకలతో కోవిడ్ ఆస్పత్రి.. ఏపీలో సంపూర్ణ లాక్డౌన్