Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పవన్ కల్యాణ్ పావలాగాడా...? యామినీ అక్కా ఏంటి నీ లొల్లి... ఎవరు?

Advertiesment
పవన్ కల్యాణ్ పావలాగాడా...? యామినీ అక్కా ఏంటి నీ లొల్లి... ఎవరు?
, గురువారం, 22 నవంబరు 2018 (15:31 IST)
తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి యామిని సాధినేనికి జనసేన నాయకురాలు ప్రియా సౌజన్య వార్నింగ్ ఇచ్చారు. నేరుగా ఫేస్ బుక్ లైవ్ లోకి వచ్చిన ఆమె ఇలా అన్నారు. " యామినీ అక్కా... ఏమిటీ నీ లొల్లి. నీ లెక్కలేంటో చెపుతామని వచ్చా. తెదేపా వాళ్లు ఇచ్చేవి సరిపోకపోతే మరేదైనా పని చేసుకో. అక్కా... నీ పని నువ్వు చేసుకో. తెలుగుదేశం వాళ్లు ఏమైనా కొత్త పథకాలు పెడితే వాటి గురించి మాట్లాడుకో. 
 
మీలా దొంగ దీక్షలు చేయడం మాకు రాదు. మా నాయకుడు ప్రజల కోసం వచ్చారు. చంద్రబాబు నాయుడు ఏ రకంగా తెదేపా వారసుడు అవుతారు. ఎన్టీఆర్ కొడుకులను తొక్కేసి పార్టీని తీసుకున్న చంద్రబాబు నాయుడు వారసుడు అవుతారా అక్కా... 2019లో నీకు అందరూ సమాధానం చెపుతారు. 
 
మీడియా ముందు టార్గెట్ చేయాలి అనుకుంటే... పవన్ కల్యాణ్ అక్కర్లేదు. ఇంకా... ఏమయినా మాట్లాడు. శ్రీకాకుళం బాధితుల ఇంటికి వెళ్లి పచ్చడి అన్నం తినమను. పిచ్చవాగుడు వద్దు. పవన్ కల్యాణ్ సీఎం అవుతారో లేదో మీరు మాట్లాడవద్దు. లోకేష్ బాబుకి వర్థంతి, జయంతికి తేడా తెలియదు.
webdunia
 
పవన్ కల్యాణ్ పావలాగాడు... అంటారా... మీకు 2014లో ఆ విషయం తెలీదా... ఎన్నికల్లో వాడుకున్నప్పుడు ఈ విషయం తెలియదా... లోకేష్ బాబు 2000 రూపాయల నోటా.... అమెరికా నుంచి వచ్చిన అతడికి ఏమీ తెలియకపోయినా మంత్రి పదవి ఎలా ఇచ్చారు. లోకేష్ బాబును రోడ్డు మీదకు రమ్మను. మా నాయకుడు కూడా వస్తారు. అప్పుడు తెలుస్తుంది ఎవరి సత్తా ఏమిటో. ఐనా నీ కంపెనీలకు అన్ని ఆర్డర్లు ఎలా వస్తున్నాయి... ఇవన్నీ ఎవరికీ తెలియవని అనుకుంటున్నావా అక్కా... సౌజన్య అంటే కఠినంగా మాట్లాడుతుంది అంటారంతా... కానీ నేను నీకోసం చాలా సౌమ్యంగా మాట్లాడుతున్నా" అని అన్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అండమాన్ దీవిలో బాణాలతో చంపి శవాన్ని భూమిలో సగభాగం పూడ్చిపెట్టారు.