Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

జనసేన సలహాదారుగా జయప్రకాష్‌ నారాయణ్?

ప్రత్యక్ష ఎన్నికల్లోకి వెళ్ళి చివరకు లోక్ సత్తా పార్టీ చతికిలపడిన విషయం తెలిసిందే. ప్రజలు ఏ మాత్రం ఆ పార్టీని ఆదరణ కరవవడంతో ఇక చేసేది లేక ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసేది లేదని పార్టీ వ్యవస్థాపకులు జయప్రకాష్ నారాయణ్ ఇప్పటికే ప్రకటించారు. అయితే ప్రజా

Advertiesment
జనసేన సలహాదారుగా జయప్రకాష్‌ నారాయణ్?
, బుధవారం, 27 డిశెంబరు 2017 (22:06 IST)
ప్రత్యక్ష ఎన్నికల్లోకి వెళ్ళి చివరకు లోక్ సత్తా పార్టీ చతికిలపడిన విషయం తెలిసిందే. ప్రజలు ఏ మాత్రం ఆ పార్టీని ఆదరణ కరవవడంతో ఇక చేసేది లేక ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసేది లేదని పార్టీ వ్యవస్థాపకులు జయప్రకాష్ నారాయణ్ ఇప్పటికే ప్రకటించారు. అయితే ప్రజా సమస్యలపై గళం విప్పుతామని మాత్రం చెబుతూ వచ్చారు. అలాంటి జయప్రకాష్‌ గత కొన్నినెలలుగా ఎపిలోని జిల్లాలలో పర్యటిస్తూ విద్యార్థులకు సమాజంలో ఎలాంటి మార్పులు వస్తే బాగుంటుందన్న విషయాన్ని తెలిపే ప్రయత్నం చేస్తున్నారు.
 
అయితే జయప్రకాష్‌ నారాయణ్ జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌ పైన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారుతున్నాయి. సమాజం పట్ల తపన, మార్పు కావాలని కోరుకున్నవారు ఎవరైనా సరే తనను సహాయం అడిగితే చేయడానికి సిద్ధంగా ఉన్నా.. పవన్ కళ్యాణ్‌‌లో అలాంటివి నాకు ఎక్కువగా కనిపిస్తున్నాయని చెప్పారు జయప్రకాష్‌ నారాయణ్. 
 
అయితే పవన్ కళ్యాణ్ స్వయంగా నన్ను పిలవాలి. నన్ను వచ్చి కలిసి నాతో మాట్లాడాలి. అప్పుడు ఏ విధంగా సహాయం చేయాలి.. అన్న విషయాన్ని ఆలోచిస్తాను అని చెప్పారు‌. జయప్రకాష్ లాంటి వ్యక్తి జనసేన పార్టీకి సలహాదారుగా ఉంటే ఖచ్చితంగా పార్టీ మరింత పటిష్టమయ్యే అవకాశం ఉంటుందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. మరి జనసేన అధినేత ఏం చేస్తారో చూడాలి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మంత్రి అనుచరుడి కబ్జా బాగోతం... 10 కోట్ల స్థలంపై కన్ను... ఎక్కడ?