Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Saturday, 11 January 2025
webdunia

ఎర్ర కండువాను తెగ వాడేస్తున్న మెగా ఫ్యామిలీ హీరోలు

Advertiesment
game changer

ఠాగూర్

, శనివారం, 14 సెప్టెంబరు 2024 (12:04 IST)
జనసేన పార్టీ అధినేత, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌కు ఎర్ర తువాల్ (కండువా) అంటే ఏమితమైన ఇష్టం. ఆయన నటించిన "గబ్బర్ సింగ్" చిత్రంలో తొలిసారి ఈ ఎర్ర కండువాతో కనిపించారు. అప్పటి నుంచి మెగా ఫ్యామిలీ హీరోలు సమయం సందర్భం చిక్కినపుడల్లా ఎర్ర తువాలుతో కనిపిస్తున్నారు. పైగా, ఇది ఇపుడు జనసేన పార్టీ అధికారిక కండువా కూడా మారిపోయింది. 
 
ఈ మధ్యే రామ్ చరణ్ కొత్త చిత్రం "గేమ్‌‍ఛేంజర్" సినిమా రెండో లిరికల్ సాంగ్ అప్డెట్ నిమిత్తం రివీల్ చేసిన పోస్టరులో చరణ్ తలకు రెడ్ టవల్ కట్టి కనిపించటం ఫ్యాన్స్‌‍ను ఎగ్జైట్ చేసింది. తాజాగా "మట్కా" చిత్రీకరణ కోసం క్లీన్ షేవ్‌లో వరుణ్ కనపించారు. ఇందులో వరుణ్ తేజ్ ఎర్ర తుండుతో కనిపించడం హైలైట్ అయింది. నిజానికి పవన్ కల్యాణ్ "గబ్బర్ సింగ్" సినిమాలో రెడ్ టవల్ వాడినప్పటి నుంచి ఇదోక ట్రెండ్‌గా మారిపోయింది. 
 
గతంలో సాయిధరమ్ తేజ్ విన్నర్ సినిమాలో ఎర్ర తుండుతో కనిపించారు. ఇక జనసేన పార్టీ పెట్టాక ఈ ఎర్ర తుండు అనేది పార్టీ కండువా అన్నట్టుగా మారిపోయింది. పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ ఎప్పుడు మీటింగ్ జరిగినా రెడ్ టవల్స్ కట్టుకుని హడావుడి చేయటం చూస్తున్నాం. వారిని ఉత్సహా పరిచేలా మెగా హీరోలు కూడా అవకాశం దొరికినపుడల్లా ఎర్ర తుండును తమ సినిమాల్లో అదోక సందర్బంలో వాడుతూ కనిపిస్తున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తొమ్మిదో సారి.. మళ్లీ బెంగుళూరుకు వెళ్లిపోయిన వైఎస్ జగన్