Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కాపులకు రిజర్వేషన్లు రావడం సాధ్యం కాదా.. ఎందుకు?

కాపు, బలిజ, ఒంటరి, తెలగ వారందరినీ బిసిల్లో చేర్చడమే కాకుండా ఐదు శాతం రిజర్వేషన్లు ఇస్తూ ఎపి మంత్రివర్గం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు కాపులు కృతజ్ఞతలు చెబుతున్నారు. కొన్ని చోట్ల ముఖ్యమంత్రికి పాలాభిషేకాలు కూడ

కాపులకు రిజర్వేషన్లు రావడం సాధ్యం కాదా.. ఎందుకు?
, మంగళవారం, 5 డిశెంబరు 2017 (13:28 IST)
కాపు, బలిజ, ఒంటరి, తెలగ వారందరినీ బిసిల్లో చేర్చడమే కాకుండా ఐదు శాతం రిజర్వేషన్లు ఇస్తూ ఎపి మంత్రివర్గం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు కాపులు కృతజ్ఞతలు చెబుతున్నారు. కొన్ని చోట్ల ముఖ్యమంత్రికి పాలాభిషేకాలు కూడా చేశారు. అయితే కాపులకు రిజర్వేషన్లు రావడం చాలా కష్టమన్న విషయం చాలా మందికి తెలియదు. ఎపి ప్రభుత్వం తీర్మానించి పంపిన ఈ రిజర్వేషన్లకు కేంద్ర ప్రభుత్వం గ్రీస్ సిగ్నల్ ఇవ్వడం ఏ విధంగానూ సాధ్యం కాదు.
 
ఎందుకంటే రాజ్యాంగ సవరణ జరగాలి. 9వ షెడ్యూల్ మార్చాలి. పార్లమెంటులో ఆమోదముద్ర లభించాలి. ఇదంతా సాధ్యమవ్వడం కల్లే. రాజ్యాంగాన్ని మార్చడం చాలా కష్టం. ఇప్పటికే బిసీల్లో 141కిపైగా కులాలు ఉంటే కొత్తగా మరో నాలుగింటిని ప్రభుత్వం అందులో చేర్చడం బిసిలకు ఏ మాత్రం ఇష్టం లేదు. ఇదొక రకమైన పోరాటం జరుగుతోంది. అంతే కాదు 20కిపైగా రాష్ట్రాల్లో ఇదే పరిస్థితి ఏర్పడితే కేంద్రం చేతులు కట్టుకుని గమ్మని జరుగుతున్నదాన్ని చూస్తూ కూర్చుంది. 
 
అలాంటిది ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఒక తీర్మానం చేసి పంపిన వాటిని కేంద్రం ఆమోదం ఇస్తుందనుకోవడం మాత్రం ఎట్టి పరిస్థితుల్లోను సాధ్యం కాదని తెలుస్తోంది. కర్ర విరగకుండా, పాము చావకుండా చంద్రబాబు ఎంతో ముందు ఆలోచనతో కాపులకు రిజర్వేషన్లు ప్రకటించారు గాని, అది కాస్త కేంద్రంలో ఆమోదం లభించడమనేది ఎట్టి పరిస్థితుల్లోను సాధ్యం కాదు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వేరొకరితో భార్య నవ్వుతూ మాటలు... ముక్కలు ముక్కలుగా నరికిన భర్త...